Moviesస్టార్ హీరో మాజీ భార్య‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రియుడు...!

స్టార్ హీరో మాజీ భార్య‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రియుడు…!

బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్ త‌న చిన్న‌నాటి స్నేహితురాలు అయిన సుసానేఖాన్‌ను ప్రేమించి 2000లో పెళ్లి చేసుకున్నాడు. అప్ప‌ట‌కి క‌హానా ఫ్యార్‌హై సినిమాతో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన హృతిక్ త‌న తొలి సినిమా క్రేజ్‌తో దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు అయిపోయాడు. అయితే త‌న రెండో సినిమా రిలీజ్ కాకుండానే పెళ్లి చేసుకుని అంద‌రికి షాక్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత హృతిక్ బాలీవుడ్ ఖాన్‌ల‌కే గ‌ట్టి పోటీ ఇచ్చి స్టార్‌గా మారాడు.

 

అయితే సుసానేతో మ‌న‌స్ప‌ర్థ‌లు రావడంతో ఈ జంట 2014లో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ దంప‌దుల‌కు హ్రీహాన్‌, హ్రీదాన్ అనే ఇద్ద‌రు కొడుకులు కూడా ఉన్నారు. ఇక సుసానే హృతిక్‌కు విడాకులు ఇవ్వ‌డానికి బాలీవుడ్‌కే చెందిన మ‌రో హీరో కార‌ణం అని అప్పట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు సుసానే ఖాన్ అర్స్‌ల‌న్ గోనితో డేటింగ్ చేస్తున్న‌ట్టు కొద్ది రోజులుగా బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది.

కొద్ది రోజుల క్రితం సునానేకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేల‌డంతో ఆమె ఇన్‌స్టాలో ఆ విష‌యం పోస్ట్‌గా పెట్టింది. దీనిపై స్పందించిన అర్స్‌ల‌న్ త్వరలోనే నువ్వు కోలుకుంటావు అని చెప్ప‌డంతో పాటు 3 హార్ట్ ఎమోజీలు, 1 కిస్ ఎమోజీ పోస్ట్ చేసి ఆమెపై త‌న‌కు ఉన్న ప్రేమ‌ను చాటాడు. అయితే ఈ కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీనిపై స్పందించిన అర్స్‌ల‌న్ ఎవ‌రైనా త‌మ అభిప్రాయం చెప్పొచ్చు.. కానీ తాను కొంచెం స్వీట్‌గా చెప్పాల‌నుకున్నాన‌ని చెప్పాడు.

సుసానేతో డేటింగ్ గురించి మాట్లాడుతూ దాని గురించి తాను మాట్లాడుకోవాల‌ని అనుకోవ‌డం లేద‌ని.. అయితే దీనిపై బ‌య‌ట చ‌ర్చ జ‌రిగే చాలా విష‌యాలు త‌న దృష్టికి వ‌స్తున్నాయ‌ని.. అయితే తామిద్ద‌రం సంతోషంగా ఉన్నాం అని మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌ను అని అర్స్‌ల‌న్ చెప్పాడు. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నంత మాత్రానా సుల‌భంగా ఛాన్సులు ఎవ్వ‌రూ ఇవ్వ‌ర‌ని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news