Moviesరాజమౌళిని మించిన హిట్ ఇస్తా..చరణ్‌కి ఆ డైరెక్టర్ బంపర్ ఆఫర్..?

రాజమౌళిని మించిన హిట్ ఇస్తా..చరణ్‌కి ఆ డైరెక్టర్ బంపర్ ఆఫర్..?

మెగా పవర్‌ స్టార్ రాంచరణ్..మెగాస్టార్ చిరంజీవి వారసత్వాని అందిపుచ్చుకుని టాలీవుడ్ లోకి హీరోగా అడుగు పెట్టి ..ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలు చేసే స్దాయికి ఎదిగిపోయాడు. ఎంత మెగా స్టార్ కొడుకు అయినా కానీ చరణ్ లో టాలెంట్ లేకపోతే..అభిమానులు ఆయన్ని ఆధరించరు. ఇక తండ్రి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్.. తన దైన స్టైల్లో నటిస్తూ.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

తండ్రి మెగా స్టార్‌, బాబాయ్‌ పవర్‌ స్టార్‌.. వీరిద్దరి లక్షణాలను పుణికి పుచ్చుకున్న హీరో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌…ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో నటిస్తున్న ఆయన త్వరలో సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నారు.

అయితే, తాజాగా సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మెగపవర్ స్టార్ రాం చరణ్ ఓ యంగ్ డైరెక్టర్ కాంబినేషన్ లో మూవి చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు..రీసెంట్ గా నాని తో శ్యాం సింగరాయ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. మొదటి సినిమా రౌడి హీరో విజయ్ దేవరకొండ హీరోగా పెట్టి టాక్సీవాలా అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా భారీ హిట్ అందుకున్నాడు.

ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్దాయి ఏర్పర్చుకున్న రాహుల్.. దీని తర్వాత దాదాపు మూడు ఏళ్లు గ్యాప్ తీసుకుని..లేట్ గా అయిన లెటేస్ట్ గా వస్తా.. హిట్ కొడతా అంటూ నేచురల్ స్టార్ నాని తో శ్యాం సింగరాయ్ తెరకెక్కించి తిరుగులేని విజయాని అందుకున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి ని దేవదాసిగా.. యంగ్ హీరోయిన్ కృతిశెట్టి అందాలను మరింత హాట్ గా చూయించడంలో రాహుల్ సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఇక ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ టైమ్ ట్రావెల్ కథతో ఓ సినిమా తెరకెక్కించేందుకు స్టోరీని రెడీ చేసుకుంటున్నాడట. అంతేకాదు ఈ కథను మెగా పవర్ స్టార్ రాం చరణ్‌ కోసం రాస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. స్టోరీ మొత్తం కంప్లీట్ అయ్యాక చరణ్‌కు వినిపిస్తాను..ఒక్కవేళ ఆయనకు ఈ స్టోరీ నచ్చితే..ఓకే చేస్తే ఖచ్చితంగా రాజమౌళి మగధీర ని మించిన హిట్ ఆయనకి ఇస్తా అంటూ సన్నిహితుల దగ్గర చెప్పుకొస్తున్నాడట. ఇక రాహుల్ ఇంత నమ్మకంగా చెప్తున్నారంటే సినిమాలో మచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటున్నారు నెటిజన్స్. మరి చూడాలి చరణ్ ఒప్పుకుంటాడా లేదా అనేది.?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news