Moviesఐటెం సాంగ్స్ తో మెప్పించిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..!!

ఐటెం సాంగ్స్ తో మెప్పించిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..!!

సినిమాలు హిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాలి. అది ఏ ఇండస్ట్రీ అయిన సరే. కోలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా మాలీవుడ్ అయినా తమ సినిమాలలో వినోదం ఉండాలి. దాని కోసం ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఒక్క ఐటమ్ సాంగ్ పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు డైరెక్టర్లు. సినిమాకు హైప్ పెరగాలంటే ఖచ్చితంగా వారి సినిమాలలో ఐటెం సాంగ్స్ ఉండాల్సిందే. అంతే కాదు సినిమాకు విడుదలకు ముందే క్రేజ్ పెంచడం కోసం ఐటమ్ సాంగ్స్ ని విడుదల చేసి మంచి హైప్ ను పెంచేస్తున్నారు మేకర్స్.

ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలో ఒకరు నటిస్తే, ఐటమ్ సాంగ్స్ కోసం మరొకరు నటించేవారు. కానీ ప్రస్తుతం మాత్రం పలు సినిమాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో కనిపిస్తున్నారు. ఈ విధంగా పలు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ లో కనిపించి సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. సినిమాలలో ఉండే ఈ ఐటమ్ సాంగ్స్ ను ప్రస్తుత కాలంలో స్పెషల్ సాంగ్స్ అంటూ సంబోదిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్స్ కి స్టెప్పులేసి మెప్పించారు.. అయితే ఎవరెవరు ఐటమ్ సాంగ్స్ లో నటించారో ఇప్పుడు తెలుసుకుందాం.

అనుష్క:
ఈ అరుంధతమ్మ కెరియర్ మొదట్లోనే స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన ప్రత్యేక పాటలో సందడి చేసింది. అదేవిధంగా నాగార్జున కేడి సినిమాలో కూడా ఓ ప్రత్యేక పాటలో కనిపించారు.


కాజల్:
రెండు రాష్ట్రాలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ జనతా గ్యారేజ్ సినిమా లో పక్కా లోకల్ సినిమా తో థియేటర్లను దుమ్ముదులిపేసింది.


పూజా హెగ్డే:
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న వారిలో పూజాహెగ్డే ఒకరు.ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బుట్టబొమ్మ రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.

అంజలి:
పద్ధతి కి పట్టు చీర కట్టినట్టు గా ఉండే అంజలి సరైనోడు సినిమాలో ఐటమ్ సాంగులకు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.. అంతేకాదు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో ఉండే అంజలినేనా అని అందరూ ఆశ్చర్యపోయేలా తన ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో మంది హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

శృతిహాసన్:
స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శృతిహాసన్ మహేష్ బాబు నటించిన ఆగడు సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించారు.

సమంత: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఉ అంటావా మావ‌.. ఊఊ అంటావ మావ అంటావ మాస్ డ్యాన్సుల‌తో రెచ్చిపోయింది సమంత.

వీళ్లందరూ కెరీర్ చివర్లో ఉండి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. టాప్ ఫాంలో ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్ చేశారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news