Moviesత‌మ‌కంటే వ‌య‌స్సులో పెద్ద‌వాళ్ల‌తో న‌టించిన హీరోయిన్లు వీళ్లే..!

త‌మ‌కంటే వ‌య‌స్సులో పెద్ద‌వాళ్ల‌తో న‌టించిన హీరోయిన్లు వీళ్లే..!

సినిమా రంగంలో హీరోయిన్లకు చాలా తక్కువ లైఫ్ టైం మాత్రమే ఉంటుంది. మహా అయితే హీరోయిన్లు ఆరేడు సంవత్సరాలకు మించి ఇండస్ట్రీలో కొనసాగటం గొప్ప విషయమే. ఇక సీనియర్ హీరోలకు ఇటీవల కాలంలో హీరోయిన్లు దొరకడం కష్టమైపోతుంది. ఈ క్రమంలోనే వయసులో తమ కంటే చాలా పెద్దవాళ్లు అయిన‌ హీరోలతో కలిసి నటించక త‌ప్ప‌డం లేదు. అలా న‌టిస్తోన్న హీరోయిన్ల‌ గురించి ఒకసారి తెలుసుకుందాం.

1- మహేష్ బాబు – రష్మిక మందన్న:
మహేష్ బాబు , ర‌ష్మిక స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో న‌టించారు. వీరిలో మ‌హేస్ ఆగ‌స్టు 9, 1975లో జ‌న్మిస్తే, ర‌ష్మిక ఏప్రిల్ 5, 1996లో జ‌న్మించింది. మ‌హేష్ కంటే వ‌య‌స్సులో ర‌ష్మిక ఏకంగా 21 సంవ‌త్స‌రాలు చిన్న‌ది.

2. నయనతార – నాగార్జున:
నయనతార నాగార్జున కలిసి మొదటిసారి బాస్ సినిమాలో క‌నిపించారు. ఆ త‌ర్వాత గ్రీకువీరుడు సినిమాలో మ‌రోసారి జోడీ క‌ట్టారు. నాగార్జున కంటే న‌య‌న‌తార వ‌య‌స్సులో 25 ఏళ్లు చిన్న‌ది.

3. తమన్నా – చిరంజీవి :
సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా, నయనతార ఇద్దరూ కలిసి చిరు ప‌క్క‌న న‌టించారు. వీరిద్ద‌రు కూడా చిరు కంటే చాలా చిన్న వాళ్లే. త‌మ‌న్నా అయితే చిరు త‌న‌యుడు చెర్రీతో క‌లిసి న‌టించ‌డంతో పాటు అటు తండ్రితో కూడా జోడీ క‌ట్టింది. ఇప్పుడు భోళా శంక‌ర్‌లో మ‌రోసారి జోడీ క‌ట్ట‌బోతోంది. చిరు వ‌య‌స్సులో త‌మ‌న్నా కంటే 35 సంవ‌త్స‌రాలు పెద్ద‌వాడు.

4. రవితేజ – నటా:
ర‌వితేజ‌తో డిస్కోరాజా సినిమాలో న‌టించిన న‌టా న‌బేష్ వ‌య‌స్సులో ర‌వితేజ కంటే 27 సంవ‌త్స‌రాలు చిన్న‌ది. అలాగే ఇదే ర‌వితేజ‌తో నటించిన మ‌రో హీరోయిప్ పాయ‌ల్ రాజ్‌పుత్ ర‌వితేజ కంటే 24 సంవత్సరాలు చిన్నది.

5. అంజలి – వెంకటేష్:
సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, మసాలా సినిమాలలో మెరిసిన ఈ జంటలో వెంకీ కంటే అంజ‌లి 26 సంవ‌త్స‌రాలు చిన్న‌ది. అయినా ఈ జోడీ తెర‌మీద బాగానే ఉంది.

6. బాలకృష్ణ – ప్రగ్యా జైస్వాల్:
అఖండ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా న‌టించిన ప్ర‌గ్య జైశ్వాల్ వ‌య‌స్సులో ఆయ‌న కంటే 31 సంవ‌త్స‌రాలు చిన్న‌ది. అయితే వీరి రొమాన్స్ – కెమిస్ట్రీ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది.

7. పవన్ కళ్యాణ్ – అను ఇమ్మానియేల్:
త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అజ్ఞాతవాసి సినిమాలో ప‌వ‌న్ ప‌క్క‌న కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యియేల్ ఇద్ద‌రూ న‌టించారు. వీరిద్ద‌రు కూడా ప‌వ‌న్ కంటే చాలా చిన్న‌వాళ్లే. అను అయితే ప‌వ‌న్ కంటే 26 సంవ‌త్స‌రాలు చిన్న‌ది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news