Moviesఈ ఫొటోలో చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్‌.. మీరు గుర్తు ప‌ట్టారా..!

ఈ ఫొటోలో చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్‌.. మీరు గుర్తు ప‌ట్టారా..!

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరికి వారు ప్రపంచానికి త‌మ‌ను తాము సరి కొత్తగా పరిచయం చేసుకుంటున్నారు. ఇక సినిమా సెలబ్రిటీలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా సోషల్ మీడియాలో తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుని స్టార్లు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సోషల్ మీడియా క్రేజ్‌ మామూలుగా లేదు.

 

ఇదిలా ఉంటే కొందరు సెలబ్రిటీలు తమ చిన్నప్పటి ఫోటోలు, పాత స్మృతులను సోషల్ మీడియాలో తమ‌ అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇవి బాగా వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరూ తమ చిన్నప్పటి అనుభూతులను సోషల్ మీడియాలో పెడుతుండడంతో వాటిని అభిమానులు లైక్ చేసి కామెంట్ చేయడంతోపాటు షేర్లు చేస్తున్నారు. దీంతో అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 

తాజాగా పై ఫోటోలో ఒక చిన్న పాప రెండు జడలతో అమాయకంగా నవ్వుతూ స్కూల్ డ్రెస్సులో చక్కగా ఫోటోకు పోజు ఇస్తోంది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో ? మీరు గుర్తుపట్టారా… ఆమె ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్. తన అందంతో పాటు అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రాయే ఆ ఫోటోలో ఉన్న పాప. టాలీవుడ్లో ఎస్ఎంఎస్ ( శివ మనసులో శృతి ) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెజీనా తొలి సినిమాతోనే నటనా పరంగా మంచి మార్కులు దక్కించుకుంది.

ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం – సుబ్రహ్మణ్యం ఫ‌ర్ సేల్‌ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత రెజీనా కొత్తజంట – జో అచ్యుతానంద – పవర్‌ లాంటి సినిమాల్లో కూడా నటించింది. అయితే ఆమెకు ఉన్న టాలెంట్ తో పోలిస్తే ఎందుకోగానీ స్టార్ హీరోల పక్కన అవకాశాలు రాలేదు. ఆమె వ‌చ్చే యేడాది రాబోతోన్న‌ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించింది. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక అయినా రెజీనాకు అవకాశాలు క్యూ కడతాయేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news