Moviesరాజ‌మౌళిపై సెటైర్ వేసిన తార‌క్‌... ఒక్క‌సారిగా న‌వ్వులే న‌వ్వులు...!

రాజ‌మౌళిపై సెటైర్ వేసిన తార‌క్‌… ఒక్క‌సారిగా న‌వ్వులే న‌వ్వులు…!

క‌రోనా సెకండ్ల తర్వాత ఇప్పుడు వరుస పెట్టి పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. బాలయ్య అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద మాస్ జాతరను తలపిస్తోంది. వచ్చేవారం అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ అవుతోంది. జనవరి 7వ తేదీన దేశవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా థియేటర్లలోకి దిగనుంది. రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత తెరకెక్కించిన సినిమా కావడంతో భారతదేశమంతా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని వెయిట్ చేస్తోంది.

మరో వైపు టాలీవుడ్ చరిత్రలోనే స్టార్ హీరోలుగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా కావడం… కోలీవుడ్ నుంచి సముద్రఖని – బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ లాంటి స్టార్లు ఉండటంతో అటు తమిళంలోనూ… ఇటు హిందీలోనూ కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్లు ఇప్పటికే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ప్రమోషన్ కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కెరీర్లోనే మొదటిసారిగా పాన్‌ ఇండియా సినిమా చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ బాలీవుడ్ మీడియా ప్ర‌శ్న‌ల‌కు స్పందిస్తోన్న తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు ఎక్కడ తడుముకోకుండా తార‌క్‌ సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళిని ఉద్దేశించి వేసిన ఒక సెటైర్‌కు అందరూ నవ్వారు.

ఒక జర్నలిస్టు మూడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం మీరు పని చేశారు… ఈ క్రమంలోనే ఎన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అందుకు తారక్ తాను రాజమౌళి సినిమా చేస్తున్నాం అని తెలిసినప్పుడు తనకు మరొక ఆఫర్ ఎవరు ? ఇస్తారు అని చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా కొద్ది సేపు హాయిగా నవ్వేశారు. ఏదేమైనా రాజమౌళి సినిమా అంటే అది పూర్తయ్యేంత వరకు ఫుల్ డేట్స్ ఆయనకే ఇచ్చేయాల్సిందే కదా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news