Moviesబాల‌య్య సినిమాలో కోలీవుడ్ క్రేజీ హీరో... కేక పెట్టించే కాంబినేష‌న్‌..!

బాల‌య్య సినిమాలో కోలీవుడ్ క్రేజీ హీరో… కేక పెట్టించే కాంబినేష‌న్‌..!

యువరత్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. బాలయ్య కెరీర్లోనే తొలి వంద కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కిన అఖండ ఇప్పటికే రు. 125 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువ అవుతుంది. మరోవైపు బుల్లి తెరపై బాలయ్య అన్‌స్టాప‌బుల్‌ టాక్ షో హోస్ట్ చేస్తున్నారు. అఖండ తర్వాత బాలయ్య .. క్రాక్‌ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్న మలినేని గోపీచంద్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యతో పాటు మరో హీరోకు కూడా స్కోపు ఉందని తెలుస్తోంది.

బాలయ్య సినిమా అంటే సినిమా అంతా ఆయనే నడిపిస్తారు. తాజాగా అఖండ సినిమా చూసుకున్నా అది బాలయ్య వ‌న్ మ్యాన్‌ షో అయిపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ లో అఖండ పాత్ర ఎంటర్ అయ్యాక అసలు మిగిలిన నటులకు ఏ మాత్రం ఛాన్స్ లేకుండా బాలయ్య ఒంటిచేత్తో నడిపించేశారు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరో అంటే కాస్త ఆశ్చర్యపోవాలి. ఈ క్రమంలోనే ఈ పాత్రను కోలీవుడ్ టాప్ హీరో విశాల్ తో చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

విచిత్రమేమంటే ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గారు, పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ గా కనిపిస్తున్నారు. ఈ రెండు పాత్రలతో పాటు ఇప్పుడు కోసం గోపీచంద్ విశాల్ కోసం ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ క్రియేట్ చేశారట. విశాల్ కోలీవుడ్లో క్రేజీ హీరోగా ఉన్నా… ఆయన ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందినవారు. పైగా విశాల్ సినిమాలు అన్ని తెలుగులో డబ్బింగ్ అవుతూనే ఉంటాయి.

బాలయ్య సినిమాలు ఏపీ, తెలంగాణలో మాత్రమే రిలీజ్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు విశాల్ కూడా ఈ సినిమాలో నటిస్తే తమిళంలో కూడా బాలయ్య సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడుతుందని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా అఖండ సినిమాతో తన మార్కెట్ ను భారీగా పెంచుకున్న బాలయ్య… ఇప్పుడు కోలీవుడ్లో కౌంటర్ తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news