Moviesఒరిజినల్ ఎమోషన్ కోసం శారద అలా చేసిందా..?

ఒరిజినల్ ఎమోషన్ కోసం శారద అలా చేసిందా..?

శారద తెలుగు సినిమా పరిశ్రమలో ఈ పేరు తెలియని వారు ఉండరు. అప్పట్లో ఈమె నటనకు బడా స్టార్స్ కూడా ఫిదా అయ్యేవారు. ఈమె డ్యాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. పెద్ద పెద్ద హీరోలు సైతం ఈమెతో సినిమా చేయడానికి వెయిట్ చేసేవారు అంటే ఆమెకు ఉన్న రెంజ్ ఎలాంటిదో మనం అర్ధంచేసుకోవచ్చు. మూడు సార్లు జాతీయ ఉత్తమనటి అవార్డు అందుకున్న శారద.. సినీ ప్రస్థానం బాలనటిగా మొదలైందన్న సంగతి మనకు తెలిసిందే.

పదేళ్ళ వయసులోనే శారద తెరపై కనిపించి అందరిని అలరించారు. యన్టీఆర్, సావిత్రి నటించిన ‘కన్యాశుల్కం’లో బాలనటిగా ఓ పాటలో కనిపించారు శారద. ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపిను తెచ్చుకుంది. శారద సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలో నటించి మెప్పించిన ..కొన్ని సినిమాలు మాత్రం ఆమెకు మంచిపేరు తీసుకొచ్చాయి. శారద అంటేనే విషాద పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎందుకంటే ఊర్వశి అవార్డులు సంపాదించి పెట్టిన చిత్రాలన్నీ కన్నీరు పెట్టించేవే.. దీంతో శారద కు ఎక్కువగా అటువంటి పాత్రలే లభించాయి.

‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మబంధువు’, ‘దాగుడుమూతలు’ వంటి చిత్రాలలో పద్మనాభం జోడీగా నటించిన శారద తెలుగులో హీరోయిన్ గా నటించడానికి చాలా సమయం పట్టింది. ఆ రోజుల్లో అందరూ ఆమెను ‘ఊర్వశి’ శారద అంటూనే పిలిచేవారు. సామాన్యులు సైతం శారదను తెరపై చూడగానే ‘మన ఊర్వశి’ అంటూ ఆరాధించేవారు. ఎందుకంటే..ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమనటునికి ‘భరత్’ అని, ఉత్తమనటికి ‘ఊర్వశి’ అని అవార్డులు అందించేవారు.

అలా మూడుసార్లు ‘ఊర్వశి’గా నిలిచిన నటీమణి శారద. 1968లో మళయాళ చిత్రం ‘తులాభారం’ ద్వారా శారద తన తొలి ‘ఊర్వశి’ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తరువాత 1972లో ‘స్వయంవరం’ మళయాళ చిత్రం ద్వారా రెండోసారి, 1978లో తెలుగు చిత్రం ‘నిమజ్జనం’ ద్వారా మూడో సారి శారద జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచి ‘ఊర్వశి’ అన్న టైటిల్ ను తన పేరు ముందు గర్వంగా చేర్చుకున్నారు.

కళాతపస్వి కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన శారద అనే సినిమా ఆమె కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆమె తన కెరీర్ లో ఈ సినిమాలో ఓ సీన్ చేయడానికి అత్యధిక టేకులు తీసుకున్నారట. కళాతపస్వి కె విశ్వనాధ్ నటీనటుల నుంచి తనకు కావాల్సిన రీతిలో నటనను రాబట్టుకుంటారు అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ శారద సినిమాలో ఆమె శోభన్ బాబు కు భార్య గానటించింది. ఈ సినిమాలో శారద అన్నయ్య డాక్టర్ కోసం వెళ్లి శోభన్ బాబు ని తీసుకొస్తాడు.

వచ్చింది తన భర్తే అనుకుని ‘నేనేం తప్పు చేసానని వెళ్లిపోయారండి, నావలన తప్పు జరిగితే తిట్టొచ్చు కదండీ అని కాళ్ళమీద పడి, ఏడుస్తుంది. ఈ సీన్ ఎన్ని సార్లు చేసిన అందులో ఎమోషన్స్ మిస్ అయ్యాయట. ఇక ఆ ఒరిజినల్ ఎమోషన్ కోసం ఆమె ఏకంగా 20 టెక్ లు తీసుకుందట. కాగా ఈ సినిమాలో ఆమె నటనకు అందరు మైమరిచిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news