Moviesబృందావనం సినిమాలో ఆ సీన్ చేయడానికి ఎన్టీఆర్ అంత కష్టపడ్డారా..?

బృందావనం సినిమాలో ఆ సీన్ చేయడానికి ఎన్టీఆర్ అంత కష్టపడ్డారా..?

జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆయనకు టాలీవుడ్ లో మార్కెట్ రేంజ్ కూడా అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నాడు జూనియర్. ఆయనతో దర్శకులు కూడా అలాంటి సినిమాలే ప్లాన్ చేసారు. అయితే అప్పటి వరకు ఉన్న ఊర మాస్ కారెక్టర్ కాస్త పక్కన బెట్టి కారెక్టర్ కొత్తగా ఉందని ప్రయత్నించిన సినిమా బృందావనం అనే చెప్పాలి.

అంతక ముందే మున్నా లాంటి భారిడిజాస్టర్ ఇచ్చిన వంశీ పైడిపల్లి పై ఉన్న మళ్లీ నమ్మకంతో దిల్ రాజు ‘బృందావనం’ చిత్రాన్ని అతని దర్శకత్వంలోనే తెరకెక్కించారు. ఈసారి ఆయన నమ్మకాని నిలబెట్టారు వంశీ. బృందావనం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్ టైగర్ యన్టీఆర్ సరసన సమంత, కాజల్ నాయికలుగా నటించిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఇప్పటి క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు రచయితగా పనిచేశారు. థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గానూ నిలచింది.

ముఖ్యంగా ఈ సినిమాలో వేణు మాధవ్ కామెడీ హైలైట్ గా నిలిచింది. ఫస్టాఫ్ అంతా వేణు కామెడీతో కడుపులు చెక్కలైపోతాయి. అలాగే సెకండాఫ్‌లో బ్రహ్మానందం బొమ్మరిల్లు ఫాదర్ కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. కాగా, ఈ సినిమాలో తారక్ బ్రహ్మానందంను గదిలోకి తీసుకెళ్ళి ఫన్నీగా కొట్టే సీన్ ఒక్కటి ఉంటుంది. ఇక ఆ సీన్ కోసం ఎన్ టీఆర్ బాగా కష్టపడ్డారట నవ్వకుండా ఉండటానికి. తారక్ కొడుతుంటే బ్రహ్మానందం ఫన్నీ ఎక్స్ ప్రేషన్ స్ ఇవ్వాలి..ఇక అలా ఒక్క దెబ్బ కొట్టిన ప్రతిసారి బ్రహ్మానందం ఫన్నీ ఎక్స్ ప్రేషన్స్ కి తారక్ నవ్వుతూనే ఉన్నారట, సుమారు 12 టేకులు తీసుకుని ఆ సీన్ కంప్లీట్ చేసామని అప్పట్లో తారక్ నే స్వయంగా చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news