Moviesమెగా ఫ్యామిలీ అడ్డాలో బాల‌య్య వ‌సూళ్ల‌ బాదుడే బాదుడు..!

మెగా ఫ్యామిలీ అడ్డాలో బాల‌య్య వ‌సూళ్ల‌ బాదుడే బాదుడు..!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అఖండ ప్రభంజనం మామూలుగా లేదు. యువరత్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అఖండ జ్యోతిలా వెలుగుతుంది. కరోనా దెబ్బతో కుందేలు అయిన థియేటర్లకు ఇప్పుడు అఖండ సరికొత్త కళ ఇచ్చింది. అఖండ వసూళ్లు చూసిన టాలీవుడ్ జనాలు ఇక ధైర్యంగా తమ సినిమాలు.. థియేటర్లలో రిలీజ్ చేయవచ్చని ధీమాతో ఉన్నారు. బాలయ్యని అఖండ వంద కోట్ల హీరోను చేసేసింది.

ఇదిలా ఉంటే బాలయ్యకు ముందు నుంచి తక్కువ మార్కెట్ ఉన్న నైజాంలో అఖండ పది రోజులకు 17.47 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. నైజాంలో ఈ సినిమాను రు 10.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ కు అమ్మారు. అయితే ఇప్పుడు అక్కడ లాంగ్ ర‌న్ ముగిసేసరికి రూపాయికి రూపాయికి పైగా లాభం వచ్చేలా కనిపిస్తోంది. ఏదేమైనా అఖండ సూపర్ హిట్ కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది.

అలాగే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్‌ హిట్ గా నిలిచింది. అఖండ విజయంతో ఉత్సాహంతో ఉన్న బాలయ్య ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మరో పవర్ ఫుల్ ఫ్యాక్ష‌న్‌ స్టొరీ తో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే నైజాం అంటేనే ముందు నుంచి మెగా ఫ్యామిలీకి అడ్డాగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో పాటు మెగా ఫ్యామిలీలో చిన్న హీరోల సినిమాలకు సైతం ఇక్కడ భారీ వసూళ్లు వస్తుంటాయి.

అలాంటి మెగా ఫ్యామిలీ అడ్డాలో ఇప్పుడు బాలయ్య అఖండ వసూళ్ల బాదుడు చూసి ఇండస్ట్రీలో సైతం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇప్పుడు బాలయ్య ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా ఇటీవల వరుస ఫ్లాపులతో ఉన్నారు. నైజాంలో హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆయన సినిమాలకు అనుకున్న స్థాయిలో వసూళ్లు రావు.

లయ్య హిట్ సినిమాలు కూడా హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో అన్ని వసూళ్లు లేవు. అయితే ఇప్పుడు అఖండ నైజాం అంతటా వసూళ్ల వర్షం కురిపిస్తుండటంతో ట్రేడ్ వర్గాలు – ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్య పోతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news