Moviesకన్న కొడుకుపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన నటి..సినీ ఇండస్ట్రీలో సంచలనం..!!

కన్న కొడుకుపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన నటి..సినీ ఇండస్ట్రీలో సంచలనం..!!

మనం గమనించిన్నట్లైతే సాధారణంగా తల్లిదండ్రులు తమ బిడ్డలు ఏదైన తప్పు చేస్తే అరుస్తాం. మరీ తప్పుడు పని చేస్తే ఒక్క దెబ్బ వేస్తాం. ఎందుకనీ ఆ పని చేయడం తప్పు ఇంకోసారి చేయకు అని. కానీ అదే కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డ వేరే వాళ్లని లైంగికంగా వేధించిన..చేయరాని తప్పు చేసినా..వారిని తిడతారు కొడతారు అంతేకానీ వారికి న్యాయ పరంగా సిక్ష పడేలా చేయారు. ఇంకా చెప్పాలంటే వారిని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇక సెలబ్రిటీలు అయితే… తమ బిడ్డ ఎంత పెద్ద తప్పు చేసిన పేరు బటయకు రానివ్వకుండా మేనేజ్ చేస్తారు. చట్టానికి దొరకనీకుండా తమ తెలివితేటలతో బిడ్డను రక్షించుకోవడానికి స్దాయి శక్తుల ప్రయత్నిస్తారు. అలాంటిది ఓ నటి స్వయంగా తన కొడుకుపైనే లైంగిక వేధింపుల కేసు పెట్టింది.

అయితే ఇక్కడ ఓ తల్లి సాహసించి, తెగ్గించి..తన బిడ్డ పై తానే లైంగిక వేధింపుల కేసు పెట్టింది. వినడానికి చదవడానికి షాకింగ్ గా ఉన్నా ఇదే నిజం. మలయాళీ నటి మాల పార్వతీ తన కొడుకు అనంత్‌ కృష్ణన్‌ పై లైగింక వేధింపుల కేసు పెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. ఊహించని పరిణామంతో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ట్రాన్స్‌జెండర్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ సీమా వినీత్‌ తన తో అనంత్‌ కృష్ణన్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని సోషల్ మీడియాలో నటి మాల పార్వతీ కుమారుడిపై ఆరోపణలు చేసింది.

దీంతో మాల తన కొడుకు నిజంగా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అంటూ ఏకంగా తన బిడ్డ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకుని విచారించి తప్పు చేస్తే చట్ట బద్ధంగా తనకి సిక్ష విధించండి అంటూ ఓపెన్ గా చెప్పేసింది. తన బిడ్డ అలాంటి తప్పుచేయడని.. ట్రాన్స్‌జెండర్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ సీమా వినీత్‌ డబ్బుకోసమే తన బిడ్డ పై ఇలాంటి నిందలు వేస్తుందని స్ట్రాంగ్ చెప్పింది. పోలీసులు నా బిడ్డ ను విచారించి ఒక్కవేళ నా బిడ్డ తప్పు చేస్తే ఏం చేసినా నాకు ఓకే అంటూ చెప్పుకొచ్చింది. ఒకవేళ తన కుమారుడు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనన్నారు మాల.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news