Moviesచిరుతో 5 నిమిషాల స్పెష‌ల్ సాంగ్.... ర‌ష్మీ డిమాండ్ మామూలుగా లేదే...!

చిరుతో 5 నిమిషాల స్పెష‌ల్ సాంగ్…. ర‌ష్మీ డిమాండ్ మామూలుగా లేదే…!

తెలుగులో ప్ర‌ముఖ ఎంట‌ర్టైన్‌మెంట్ చాన‌ల్ అయిన ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోలో యాంక‌ర్‌గా ఉన్న ర‌ష్మీ గౌత‌మ్ క్రేజ్ మామూలుగా లేదు. ర‌ష్మీ అటు బుల్లితెర ప్రోగ్రామ్స్‌తో పాటు ప‌లు టీవీ షోలో కార్య‌క్ర‌మాలు చేయ‌డం.. ఇటు ప‌లు ఈవెంట్స్‌కు యాంక‌ర్‌గా చేయ‌డం.. అటు ప‌లు షాపులు ఓపెనింగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమె అప్పుడ‌ప్పుడు వెండితెర మీద మెరిసినా కూడా అక్క‌డ అనుకున్న రేంజ్‌లో అయితే స‌క్సెస్ కాలేదు.

ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గుంటూరు టాకీస్ సినిమాలో ఆమె హాట్ క్యారెక్ట‌ర్‌లో న‌టించినా కూడా ఆ సినిమా ఓ మోస్త‌రుగా ఆడినా ర‌ష్మీకి సినిమాల్లో ఛాన్సులు రావ‌డం లేదు. మ‌ధ్య‌లో ఆమె వెండితెర మీద కనిపించి చాలా రోజులు అయ్యింది. చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత ఆమెకు రెండు సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చాయి. ఆమె కెరీర్‌ను ట‌ర్న్ చేసే అదిరిపోయే ఆఫ‌ర్ వ‌చ్చింది.

ర‌ష్మీకి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేసే ఆఫ‌ర్ వ‌చ్చింది. టాలీవుడ్ ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా భోళాశంక‌ర్ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నాను హీరోయిన్‌గా ఫైన‌లైజ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరుకు చెల్లిగా కీర్తి సురేష్ న‌టిస్తోంది.

భోళాశంక‌ర్ లో సెకండాఫ్‌లో ఓ అదిరిపోయే మాస్ స్పెష‌ల్ సాంగ్ ఉంద‌ట‌. ఈ స్పెష‌ల్ సాంగ్‌లో ర‌ష్మీ గౌత‌మ్ చిరుతో స్టెప్పులు వేయ‌నుంది. మాస్‌కు కిక్ ఇచ్చేలా ఈ సాంగ్ ఉండ‌బోతోంద‌ని టాక్ ? ఈ ఐదు నిమిషాల సాంగ్ కోస‌మే ర‌ష్మి రు. 75 ల‌క్ష‌లు డిమాండ్ చేసింద‌ట‌. గుంటూరు టాకీస్ సినిమా చేసినందుకు ర‌ష్మి రు. 30 ల‌క్ష‌లు తీసుకుంది. అది పూర్తి సినిమా.. అయితే ఇప్పుడు ఐదు నిమిషాల‌కే అంత రేటు అంటే రష్మీ మామూలుగా డిమాండ్ చేయ‌లేద‌నే చెప్పాలి. ఈ సినిమాతో అయినా టాలీవుడ్‌లో ఆమె ద‌శ తిరుగుతుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news