Movies"పుష్ప" సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఇదే..!!

“పుష్ప” సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఇదే..!!

ఎవరు ఊహించని విధంగా సమంత పుష్ప సినిమాలో భాగమైంది. ఎన్నో అంచనాలతో సుకుమార్ కాంబినేషన్ లో అల్లు అర్జున్ హీరోగా..రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా “పుష్ప”. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ పూర్తి డీగ్లామర్ పాత్ర అయిన స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. ఆయన ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తోంది. ఇందులో మాలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి పోస్టర్, వీడియోస్, సాంగ్స్‏కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‏లో సమంత నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయం పై పుషప టీం అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటివరకు కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా స్పెషల్‌సాంగ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని పుష్ప టీం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒకే పాటలో బన్నీతో కలిసి మాస్‌ స్టెప్పులేయనుంది సమంత.

నిజాని నాగ చైతన్య తో పెళ్ళి తరువాత సమంత అన్నీ హోంలీ రోల్స్ చేస్తూ వచ్చింది. కానీ విడిపోయిన తరువాత ఇలా ఐటెం సాంగ్ చేడం ఏంటి అని.. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయా అని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సాధారణంగానే సుకుమార్‌ సినిమా అంటేనే ఓ స్పెషల్‌ సాంగ్ ఖచ్చితంగా ఉండాలి. అది హిట్ అవ్వాలి. ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ సూపర్‌ హిట్టే. దీనితో పాటు రంగస్థలం సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన సుకుమార్‌ అడగడంతో సమంత కాదనలేకపోయిందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా బన్నీ పక్కన మాస్ స్టెప్పులతో సమంత రెచ్చిపోతుందనే చెప్పాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news