Moviesస‌మంతకు రోజుకు రు. 50 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్‌...!

స‌మంతకు రోజుకు రు. 50 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్‌…!

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చినా స‌మంత దూకుడు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆమె కెరీర్‌ను కంటిన్యూ చేసే విష‌యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే చైతుకు విడాకులు ఇచ్చింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం ఎలా ఉన్నా చైతుకు విడాకులు ఇచ్చేశాక ఆమె మ‌రింత ప్రీ బ‌ర్డ్ అయిపోయింది. వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఈ క్ర‌మంలోనే ఆమె కు ఏ అగ్ర హీరో ఛాన్స్ ఇస్తాడా ? అని వెయిట్ చేస్తోన్న టైంలో అనూహ్యంగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో స్పెష‌ల్ సాంగ్ ఆఫ‌ర్ వ‌చ్చింది.

అస‌లే స్టార్ హీరోయిన్‌.. కాస్త వ‌య‌స్సు పెరిగినా క్రేజ్ త‌గ్గ‌ని అందం స‌మంత సొంతం. గ‌తంలో ఆమె బ‌న్నీతో సినిమాలు కూడా చేసింది. ఇక ఇప్పుడు మ‌రోసారి బ‌న్నీతో ఐటెం సాంగ్ అంటే అంచ‌నాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక మైత్రీ మూవీస్ బ్యాన‌ర్ కావ‌డంతో స‌మంత‌కు అనుబంధం ఉంది. ఇదే బ్యాన‌ర్లో రంగ‌స్థ‌లం వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే స‌మంత ఒక్క ఐటెం సాంగ్ చేసేందుకు భారీ అమౌంట్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌.

గ‌తంలో ఐటెం సాంగ్‌కు రు. కోటి ఇచ్చారు. అయితే ఇప్పుడు స‌మంత‌కు ఏకంగా రు. 2 కోట్లు ఇచ్చార‌ట‌. స‌మంత‌కు రెమ్యున‌రేష‌న్ గా రు 1.75 కోట్లు ముట్టింద‌ట‌. అయితే జీఎస్టీతో పాటు ఇత‌ర ట్యాక్సులు క‌లుప‌పుకుంటే ఆమె ఖాతాలో రు. 2 కోట్లు వేయాల్సిందే అంటున్నారు. ఆమె ఈ ఐటెం సాంగ్ కోసం నాలుగు రోజులు వ‌ర్క్ చేయాల్సి ఉంద‌ట‌. అంటే ఈ లెక్క‌న ఆమెకు రోజుకు రు. 50 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ఇస్తున్న‌ట్టు..!

ఇక ఈ స్పెష‌ల్ సాంగ్‌కు వేసే సెట్స్ అన్నీ క‌లిపి మ‌రో రు. కోటి ఖ‌ర్చు ఉంటాయ‌ట‌. ఏదేమైనా స‌మంత క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు అనేందుకు ఇదే నిద‌ర్శ‌నం అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news