Moviesసెన్షేష‌న‌ల్: రాజ‌మౌళి - మ‌హేష్ సినిమాలో హీరోయిన్‌గా స‌మంత‌...!

సెన్షేష‌న‌ల్: రాజ‌మౌళి – మ‌హేష్ సినిమాలో హీరోయిన్‌గా స‌మంత‌…!

నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత లో ఊహించ‌ని మార్పులు క‌న‌ప‌డుతున్నాయి. స‌మంత గ‌తంలో అంద‌రిని క‌లుపుకుని వెళ్లే ప్ర‌య‌త్నం పెద్ద‌గా చేసేది కాద‌నే అంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె త‌న సన్నిహితుల‌తో పాటు త‌న శ్రేయోభిలాషుల‌ను కూడా క‌లుపుకుని పోవ‌డంతో పాటు వారి స‌ల‌హాలు కూడా తీసుకుంటోంద‌ట‌. ఇక నాగ‌చైత‌న్య తో నాలుగేళ్ల వైవాహిక బంధం ముగిసింది.

చైతుతో విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుంచి స‌మంత లో స్పీడ్ మ‌రింత పెరిగిపోయింది. ఈ క్ర‌మంలోనే వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వ‌స్తోంది. ఇప్ప‌టికే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వ‌స్తోన్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోంది. దీంతో చిన్నా చిత‌కా సినిమాలు చేస్తోంది. మ‌రో వైపు ఇప్ప‌టికే చేస్తోన్న శాకుంతలం తో పాటు నానితో మ‌రో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు టాక్ ?

ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో మ‌రోసారి స్టార్ హీరోయిన్‌గా తానేంటో ఫ్రూవ్ చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న స‌మంత ఓ క్రేజీ ప్రాజెక్టులో న‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్టు టాక్ ? ఆ క్రేజీ ప్రాజెక్టు ఏదో కాదు రాజ‌మౌళి – మ‌హేష్‌బాబు సినిమా. మహేష్-సమంతది హిట్ కాంబినేషన్ అన్న‌ది తెలిసిందే. వీరి కాంబోలో దూకుడు తో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి.

మ‌ధ్య‌లో బ్ర‌హ్మోత్స‌వం ఒక‌టి ప్లాప్ అయినా కూడా వీరి క్రేజ్ ఎంత మాత్రం త‌గ్గ‌లేదు. మ‌రోసారి స‌మంత -మహేష్ సిల్వ‌ర్ స్క్రీన్ పై క‌నిపిస్తే వారి క్రేజ్ మామూలుగా ఉండ‌దు. స‌మంత ప‌ట్టుద‌ల‌తోనే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లి మ‌రీ ఈ ఛాన్సులు ద‌క్కించుకుంటోంద‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news