MoviesR R R గ్లింప్స్... ఒళ్లు గ‌గురొప్ప‌డిచే సీన్లు.. క‌ళ్లు చెదిరే...

R R R గ్లింప్స్… ఒళ్లు గ‌గురొప్ప‌డిచే సీన్లు.. క‌ళ్లు చెదిరే యాక్ష‌న్ ( వీడియో)

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే మ‌ర్చిపోలేని మ‌ల్టీస్టార‌ర్ ఆర్ ఆర్ ఆర్‌. భార‌త స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష‌ర్ల‌ను ఎదిరించిన స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు అల్లూరి సీతారామ‌రాజు, నైజాం పోరాటంలో అరివీర భ‌యంక‌ర‌మైన పోరాటంతో నిజాంనే భ‌య‌పెట్టిన ఆదిలాబాద్ మ‌న్యం గోండు వీరుడు కొమ‌రం భీం క్యారెక్ట‌ర్ల‌ను బేస్ చేసుకుని ఈ సినిమా తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. 45 సెక‌న్ల పాటు ఉన్న వీడియోలో విజువ‌ల్స్ చూస్తుంటే ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంది. అస‌లు యాక్ష‌న్ సీన్లు చూస్తుంటే క‌ళ్లు చెదిరిపోతున్నాయి.

వీడియోలు ఎక్క‌డ చూసినా బాహుబ‌లి స్టైల్లో జ‌నాలు, యుద్ధ స‌న్నివేశాలు, ఓ వైపు ఎమోష‌న‌ల్ స్టిల్స్‌, 45 సెక‌న్ల పాటు ఉన్న విజువ‌ల్స్‌లో ప్ర‌తి షాట్ కూడా యాక్ష‌న్ మూమెంట్‌తోనే ఉంది. అస‌లు ఈ వీడియో చూస్తుంటే రేపు రాజ‌మౌళి థియేట‌ర్ల‌లో బాహుబ‌లి రేంజ్ లో ఇంకా చెప్పాలంటే అంత‌కు మించిన సంచ‌ల‌నానికి రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఆలీయా భ‌ట్‌తో పాటు బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. కీరవాణి సంగీతం ఇస్తున్నారు. రు. 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news