Moviesఅయ్య బాబోయ్..మెగా డాటర్ ను అంత మాట అనేసాడు ఏంటి..?

అయ్య బాబోయ్..మెగా డాటర్ ను అంత మాట అనేసాడు ఏంటి..?

ప్రీతమ్ జుకల్కర్..కొన్ని రోజుల ముందు వరకు ఈ పేరు అసలకు సామాన్య ప్రజలకు తెలియదు. కానీ నాగ చైతన్యతో సమంత విడాకుల ఇష్యూలో ఈయన హస్తం ఉంది అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు. వీరి విడాకుల మ్యాటర్ లో ఎక్కువగా వినిపించిన పేరు ప్రీతమ్ జుకల్కర్. సమంత స్టైలిష్ట్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా అందరికీ తెలిసిన ప్రీతమ్ జుకల్కర్ అలా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సమంతతో అతనికి సంబంధం ఉండటం వల్లే నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే ఈ విషయంపై సమంత సన్నిహితులు స్పందిస్తూ.. ప్రీతమ్.. సమంతను అక్క అని పిలుస్తాడని.. వారిద్దరి మధ్య అలాంటి అక్రమ సంబంధం అంటగట్టకండి.. అంటూ కోరారు.మరోవైపు ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తుండటంతో ఆన్ లైన్ వేదికలపై ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కి దీపావళికి ప్రత్యేకమైన డెస్ డిజైన్ చేసి మరీ ఇచ్చాడు స్టైలిస్ట్ ప్రీతం. ఆ దుస్తులను స్నేహారెడ్డి ధరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రీతం డిజైన్ చేశాడు అంటూ షేర్ చేయడం బాగా వైరల్ గా మారింది. మొత్తానికి ప్రీతమ్ అయితే నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాడు.

అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పుట్టినరోజు సందర్భంగా ప్రీతం చేసిన ఒక కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన ప్రీతమ్.. పదునైన కామెంట్ చేశాడు. ‘సుందర్ లడ్‌కీ’ అంటూ పొగిడేశాడు. దీంతో ప్రతి ఒక్కరి కన్ను ఈ కామెంట్‌పై పడింది. మొత్తానికి ప్రీతమ్‌కు సమంతతో పాటు మెగా ఫ్యామిలీతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయని అర్దమౌతునాయి. దీంతో ఎంతోమంది నెటిజన్లు స్పందిస్తూ.. మెగా కుటుంబంతో మరీ అంత చనువుగా ఉండకు..సీన్ మారిస్తే భవిష్యత్తు మారిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news