Moviesఆ బాధలు భరించలేకనే ..సుధీర్‌ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడా..?

ఆ బాధలు భరించలేకనే ..సుధీర్‌ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడా..?

సుడిగాలి సుధీర్..ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జ‌బ‌ర్ద‌స్త్ అనే కామెడీ షో ద్వారా తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసున్న వ్యక్తి. జబర్ధస్త్ షో ఎంతో మంది క‌మెడియ‌న్ల‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. వీరంద‌రిలోకి జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అవ్వడంతో పాటు ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది మాత్రం సుడిగాలి సుధీర్ అనే చెప్పాలి. ముఖ్య్మగా సుడిగాలి సుధీర్ – ర‌ష్మీ జంట బుల్లితెర మీద క‌నిపిస్తే తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులు ఎంత‌లా మెస్మ‌రేజ్ అవుతారో తెలిసిందే. ఈ షోతో వ‌చ్చిన పాపులారిటీతోనే సుధీర్ సినిమా హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.

 

బుల్లితెర జోడీల్లో ర‌ష్మికి, సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జ‌బ‌ర్ద‌స్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వీళ్లిద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకుంటార‌ని క‌ప్ప‌టిక‌ప్పుడు కుప్ప‌లు తెప్ప‌లుగా వార్తలు వ‌స్తుంటాయి. అయితే సుడిగాలి సుధీర్‌, రేష్మీ ఈ పుకార్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తున్నా జ‌బ‌ర్ద‌స్త్‌, ఢీ ఛాంపియ‌న్స్ ప్రోగ్రామ్స్‌లో ఈ ఇద్ద‌రి కెమిస్ట్రీ చూసిన వాళ్లు మాత్రం వీరిద్ద‌రి ప్రేమ‌, పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు సుధీర్ – ర‌ష్మి పెళ్లి చేసుకుంటార‌ని ఏదో ఒక గాసిప్ అల్లేస్తుంటారు. అయితే తాజాగా సుధీర్ కు సంబంధించి ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే సడెన్‌గా సుధీర్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం.. మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ అని తెలుస్తుంది. ప్రస్తుతం హీరోగా సుధీర్‌ మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటితోపాటు కమెడియన్‌గా కూడా చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇటు జబర్ధస్త్ షోలో అటు సినిమాలో టైం ఇవ్వలేకపోతున్నాడట సుధీర్. ఈ విషయమే మెనేజ్ మెంట్ కు చెప్పితే.. ఖచ్చితంగా ఇక్కడ చెయాల్సిందేనని పట్టుబట్టారట. సరే కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాను మళ్ళి వచ్చి చేస్తాను అన్నా సరే వాళ్ళు ఒప్పుకోలేదట. దీంతో సినిమాలకు సైన్ చేసిన సుధీర్ జబర్ధస్త్ ఆ బాధలు భరించలేకనే వాళ్ళతో చేసుకున్న తన అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకుంటున్నాడని వార్తాలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news