Moviesనాని సినిమాకు వచ్చిన బిజినెస్ కష్టాలు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

నాని సినిమాకు వచ్చిన బిజినెస్ కష్టాలు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

నాచురల్ స్టార్ నాని ప్రజల్లో నుంచి వచ్చాడు కాబట్టి ప్రేక్షకులు బాగా ఆదరించారు అని అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఏమైందో తెలియదు కానీ గత రెండు సంవత్సరాల నుంచి నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రేక్షకులకు బోర్ కొట్టాడో ఏమో తెలియదు కానీ నాని తీసిన మూడు సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయి.. అంతే కాదు నాని నటించిన వి , టక్ జగదీష్ చిత్రాలతో నటనాపరంగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ బడ్జెట్ సినిమాను చేశాడు. గత మూడు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మిగలడం తో ఆ ఎఫెక్ట్ కాస్త ఇప్పుడు ఈ సినిమాపై పడింది.

తాజాగా పంపిణీదారులు , నిర్మాతలు చెప్తున్న రేట్లను చూసి వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు అన్నట్టుగా అంటున్నారు. ఇక్కడ నాని ఫెయిల్ అవడానికి కారణం ఏమిటంటే..కామెడీ జోనర్ ను వదిలేసి యాక్షన్ హీరోగా ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉండడంతో వరుసగా అతని సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగులుతున్నాయి. శామ్ సింగరాయ్ కూడా ఇలాంటి తరహా కే చెందింది కాబట్టి బిజినెస్ కష్టాలు తప్పడం లేదు. ఇకపోతే నటుడిగా విభిన్నమైన సినిమాలు చేయడంలో తప్పేమీ లేదు కానీ ప్రేక్షకులను మెప్పించే గలిగేలా సినిమా కథలను ఎంచుకోవాలి.


అంతేకాదు డల్ మార్కెట్ సిచువేషన్ లో శ్యామ్ సింగరాయ్ సినిమాను అమ్ముకోవడం చాలా కష్టంగా ఏర్పడింది. ఈ కష్టాలలో నాని సినిమా కెరియర్ కు ఈ సినిమా ఎంత వరకు ప్లస్ అవుతుందో లేదో తెలియక అందరూ తెగ భయపడుతున్నారు. అయితే నాని ఇప్పటికైనా యాక్షన్ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టినా కామెడీ జోనర్ లో సినిమాల కథలను ఎంచుకోవడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news