Moviesచిరు ప‌క్క‌న ఉన్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా..!

చిరు ప‌క్క‌న ఉన్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా..!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ప‌ని చేసేందుకు ఎంతో మంది ఎన్నో సంవ‌త్స‌రాలుగా వెయిట్ చేస్తూ ఉంటారు. నిర్మాతలు అయితే చిరుతో సినిమాలు చేయాల‌ని కోరుకుంటూ ఉంటారు. ఇక ద‌ర్శ‌కులు అయితే చిరును డైరెక్ట్ చేసే ఛాన్స్ ఒక్క సినిమాకు వ‌చ్చినా చాలు అని అనుకుంటారు. ఇక టెక్నీషీయ‌న్ల తో పాటు హీరోయిన్లు సైతం చిరు తో క‌లిసి ప‌ని చేసేందుకు ఛాన్స్ ఎప్పుడు వ‌స్తుందా ? అని ఏళ్ల‌కు ఏళ్లుగా వెయిట్ చేస్తూ వ‌స్తూ ఉంటారు.

ఇక ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ వ‌య‌స్సులో కూడా వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్నారు. ప్ర‌స్తుతం చిరు మూడు, నాలుగు సినిమాలు లైన్లో పెట్టేశారు. ఆచార్య త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్‌, కేఎస్‌. ర‌వీంద్ర ( బాబి), మోహ‌న్ రాజా సినిమాలు ప‌ట్టాలెక్కించ నున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ డైరెక్ట‌ర్ మెగాస్టార్‌తో తాను 18 సంవ‌త్స‌రాల క్రితం దిగిన ఓ ఫొటో షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మారింది.

ఆ ఫొటోలో చిరుతో ఉంది ఎవ‌రో కాదు ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి). బాబి చిరుతో ఆయ‌న 154వ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాను చిరును 18 ఏళ్ల క్రితం క‌లుసుకున్న‌ప్పుడు ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్న‌ప్పుడు ఫొటో ఇది అని పోస్ట్ చేశాడు. తాను అప్పుడు చిరును క‌లుసుకున్న‌ప్పుడు క‌న్న క‌ల ఈ రోజు నిజం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని బాబి త‌న పోస్ట్‌లో పేర్కొన్నాడు.

 

ఇక చిరుతో బాబి తీసే సినిమాకు ఇప్ప‌టికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మంచి క‌మ‌ర్షియ‌ల్ ప‌ల్స్ ఉన్న బాబి చిరు సినిమాను ఏ రేంజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చేస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news