Newsఅన‌సూయ అస‌లు పేరు ఏంటో తెలుసా.. ఇది ఎందుకు మారింది..!

అన‌సూయ అస‌లు పేరు ఏంటో తెలుసా.. ఇది ఎందుకు మారింది..!

తెలుగు బుల్లితెర‌పై ఇప్పుడు ఉన్న యాంక‌ర్ల‌లో తిరుగులేని క్రేజ్‌తో బుల్లెట్‌లా దూసుకుపోతోంది అన‌సూయ‌. అన‌సూయ బుల్లితెర యాంక‌ర్ మాత్ర‌మే కాదు.. వెండితెర‌పై ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ల‌ను కూడా పండిస్తుంది. రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్ అన‌సూయ‌లో ఇంత అద్భుత‌మైన న‌ట‌న ఉందా ? అని ప్ర‌తి ఒక్క‌రు షాక్ అయ్యేలా చేసింది. ఇక పుష్ప సినిమాలో దాక్షాయ‌నిగా కూడా ఆమెలో మ‌రో న‌ట‌నా కోణాన్ని బ‌య‌ట‌కు తీస్తోంద‌ని అంటున్నారు.

ఆమె కంఠం పెద్ద కంచు.. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయినా కూడా ఆమె అందం ఏ మాత్రం వ‌న్నె త‌గ్గ‌లేదు. ఇప్ప‌ట‌కీ న‌ల‌భై ఏళ్ల వ‌య‌స్సులోనూ అదిరిపోయే హాట్ హాట్ డ్రెస్సుల‌తో త‌న వ‌య‌స్సు జ‌స్ట్ 20 మాత్ర‌మేనా అన్న‌ట్టుగా ఆమె యాంక‌రింగ్ ఉంటుంది. చాలా చ‌లాకీగా ఉండే అన‌సూయ బుల్లితెర‌నే కాదు.. వెండితెర‌ను కూడా షేక్ చేసే ఏకైక యాంక‌ర‌మ్మ అని చెప్పాలి.

ఇక అన‌సూయ కెరీర్ స్టార్టింగ్‌లోనే భ‌రద్వాజ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉంటే అన‌సూయ‌కు ముందుగా పెట్టాల‌నుకున్న పేరు ప‌విత్ర‌. వాళ్ల అమ్మ ఆ పేరును అన‌సూయ‌కు పెట్టాల‌ని అనుకుంద‌ట‌. అయితే వాళ్ల నాన్న త‌ర‌పున ముగ్గురు అన్న‌ద‌మ్ముల ఫ్యామిలీలో అన‌సూయ ఒకే ఒక ఆడ‌పిల్ల అట‌. అందుకే వాళ్ల నాన్న ప‌ట్టుబ‌ట్టి అన‌సూయ నాన‌మ్మ పేరు అన‌సూయ‌నే ఆమెకు కూడా పెట్టార‌ట‌.

అలా ప‌విత్రగా ఉండాల్సిన అన‌సూయ పేరు ఇలా మారింది. ఆలీతో స‌ర‌దాగా షోకు వ‌చ్చిన అన‌సూయ ఈ విష‌యాన్ని చెప్పింది. ఇక త‌న ఎత్తు కూడా జ‌స్ట్ 5.9 అంటూ స‌ర‌దాగా చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news