Moviesచాలా ప్రత్యేకమైన ఈ టాటు అర్ధం ఏమిటో తెలుసా..?

చాలా ప్రత్యేకమైన ఈ టాటు అర్ధం ఏమిటో తెలుసా..?

ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా యువ హృదయాలను కొల్లగొట్టిన ‘ఈ కన్నుగీటు భామ కుర్రకారుని మతి పొగొట్టింది. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న మలయాళీ కుట్టి. . కేవలం 30 సెకండ్స్ వీడియోలో కన్నుకొట్టి దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది. అప్పట్లో ఈ వీడియో పై ఎన్నో వేల ట్రోల్స్ వచ్చాయి. ఈమె నటించిన ‘ఒరు ఆడార్‌ లవ్‌’ ఫ్లాప్ అయినా ప్రియాకు మాత్రం ఆ సినిమా విడుదలకు ముందే మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ సినిమా ప్లాప్‌ వల్ల ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు దక్కలేదు.

ఆ తరువాత అరా కొరా సినిమా అవకాశాలు వచ్చినా అవి ఏం ఆశించినంత స్దాయి అందుకోలేకపోయాయి. యంగ్ హీరో నితిన్ నటించిన చెక్ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా చేసిన ఈ చిన్నది.. ఈ సినిమా ఆశించినంత ఫలితం సాదించనప్పటికీ ప్రియా యాక్టింగ్‌‌‌‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువా తేజ సజ్జ హీరోగా నటించిన ఇష్క్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ కన్ను గీటు భామ. ఈ సినిమా మీద చాలానే అంచనాలు ఉన్నా..ఇది కూడా ప్రియను నిరాశప్రిచింది.

ఇకపోతే ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఎద పైన ఉన్న టాటు గురించి తెలియజేశారు. తన ఎదపై ఉన్నటువంటి టాటూ అర్థాన్ని కూడా వివరించారు. ముఖ్యంగా తన ఎదపై ఉన్నటువంటి కార్పెడియం టాటూ చాల ప్రత్యేకమని,కార్పెడియం అంటే ప్రస్తుతానికి సంపూర్ణమైన జీవితాన్ని జీవించు అనే అర్థం వస్తుందని ఈ సందర్భంగా ప్రియా తెలియజేశారు. ఇక్కడ మాత్రమే కాకుండా తన మణికట్టుపై, వేళ్ళ పై కూడా ఈ విధమైనటువంటి టాటూలను వేయించుకున్ననట్లు ఈ సందర్భంగా కన్నుగీటు బొమ్మ తెలియజేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news