Moviesపెళ్లి విషయంలో యూ టర్న్ తీసుకున్న రకుల్.. కొన్నాళ్లు పాటు వాయిదా..!!

పెళ్లి విషయంలో యూ టర్న్ తీసుకున్న రకుల్.. కొన్నాళ్లు పాటు వాయిదా..!!

ర‌కుల్ ప్రీత్ సింగ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో అంతో మంది అభిమానులని సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ. కన్నడ సినిమా గిల్లితో సినీ ఇండస్టృలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన తగ్గిన గుర్తింపు రాలేదు. కానీ హిందీలో చేసిన యారియాన్ అనే సినిమాతో తన దశ తిరిగింది. ఈ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా హిట్ కావడంతో డైరెక్టర్లు కళ్లి రకుల్ పై పడ్డాయి.ఇక ఆ తరువత తెలుగు,తమిళ,హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పనే లేకుండా పోయింది ..వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్‏గా కొనసాగింది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత సమయంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

అమ్మడు లక్ బాగుండడంతో అన్నీ సినిమాలు హిట్ అవ్వడం..కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫిస్ దగ్గర ఈమె నటించిన సినిమాలు లాభాలు తెచ్చిపెట్టడంతో..స్టార్ దర్శకులు,నిర్మాతల పాలిట రకుల్ అదృష్ట దేవతగా మారిపోయింది. ఈ మధ్యనే తన బాయ్ ప్రెండ్ ను ప్రపంచానికి పరిచయం చేసిందిన్ రకుల్. బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నానంటూ చెప్పి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచింది రకుల్ ప్రీత్ సింగ్.

కొంత కాలంగా బాలీవుడ్‌ హీరో జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమాయాణం నడిపిన రకుల్‌ తాజాగా వారి బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ విష‌యం ప్ర‌క‌టించిన వెంట‌నే వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ జాతకాలను చూసి .. ఈ జంట పెళ్లి జరగడం అసాధమని చెప్పారట. ఒకవేళ ఈ జంట మొండి గా వెళ్లినా..నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతుందట. ఒకవేళ పెళ్లి జరిగినా ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని.. సంతానం కలగకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయని చెప్పిన్నట్లు తెలుస్తుంది. అయితే రీసెంట్గా ఓ మూవి ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన ఈమె తాను ఇప్పుడల్ల పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని చెప్పుకొచ్చింది. నా దృష్టి మత నా కెరీర్ పైనే అంటూ క్లరీటీ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news