Moviesఓట్ల లెక్కలు తేలాల్సిందే..భీబత్సం సృష్టిస్తున్న యాంకర్ రవి ఫ్యాన్స్..!!

ఓట్ల లెక్కలు తేలాల్సిందే..భీబత్సం సృష్టిస్తున్న యాంకర్ రవి ఫ్యాన్స్..!!

ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో చాలా ఎమోషనల్ గా సాగిందనే చెప్పాలి. ఇక శనివారం నాటి 84 ఎపిసోడ్‌లోను హౌస్ మేటస్ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపించారు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్‌లో వాళ్ళు సందడి చేశారు. ఇక ప్రతి వారం ఇంటి నుండి ఒక హౌస్ మేట్ ఎలిమినేట్ అవుతారనే సంగతి తెలిసిందే. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. నిజానికి మనకు చూయించే ఎపిసోడ్ ఒకరోజు ముందుగానే షూటింగ్ కంప్లీట్ చేసేస్తారు. సో మనం టీవీలో ఈరోజు చూసే ఎపిసోడ్ నిన్న వాళ్లు షూటింగ్ పూర్తిచేస్తారు. కాబట్టి క‌చ్చితంగా ఇన్ఫర్మేషన్ ఎలాగోల బయటికి వచ్చేస్తుంది.

పైగా ప్రతిసారి బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో మనకు శనివారమే తెలిసిపోతుంది. ఈసారి కూడా అలానే జరిగింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి బుల్లితెర టాప్ మేల్ యాంకర్ రవి బిగ్ బాస్ హౌ నుండి ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది. నిజానికి టాప్ 5 కంటెస్టెంట్ల లిస్ట్ లో రవి ఖచ్చితంగా ఉంటాడు అనుకున్నారు అందరు. నిన్న హౌస్ లోకి వచ్చిన వారు కూడా అలానే హింట్ ఇచ్చారు. కానీ బిగ్ బాస్ ఊహించని ట్వీస్ట్ ఇచ్చారు. అందరు పింకీ ఇంటి నుండి వెళ్లిపోద్ది అని ఫిక్స్ అయిపోయిన తరుణంలో అనూహ్యంగా బిగ్ బాస్ రవి ని ఎలిమినేట్ చేసారు. అందుతున్న సమాచారం ప్రకారం.. లాస్ట్ లో కాజల్ మరియు రవి డేంజర్ జోన్లో ఉంటారు.. ఇక నాగార్జున సన్నీని అడుగుతాడు నువ్వు గెలుచుకున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ రవి-కాజల్ లో ఎవరికో ఒక్కరికి యూస్ చేసి వాళ్లను సేవ్ చేస్తావా..? లేదా నువ్వు ఉంచుకుంటావా..? అని అడుగుతారు.

దీంతో సన్నీ బాగా ఆలోచించి హౌస్ లో తనకు బాగా క్లోజ్ అయిన కాజల్ ను సేవ్ చేస్తూ..రవిని ఎలిమినేట్ చేస్తారు. ఈ కారణంగా రవి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చేస్తాడు. ఇక దీని పై రవి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు ఓట్ల ఆధారంగా మీరు ఫాలో అవ్వనప్పుడు మాదగ్గర ఎందుకు ఓట్లు వేయించుకుంటున్నారు. రవి అన్నకి వచ్చిన ఓట్ల లెక్కలు మీడియాకు చూయించండి. అప్పుడు ఎలిమినేట్ చేయండి. మీకు నచ్చిన వాళ్లను ఉంచుకుని..నచ్చని వాళ్లను ఎలిమినేట్ చేసుకునేపాటైతే ఇంకెందుకు బిగ్ బాస్ షో నడపడం..అంటూ ఫైర్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news