Moviesఆ హీరోయిన్ కాలికి గాయం... కూల్ డ్రింక్‌తో చికిత్స చేసిన ఎన్టీఆర్‌

ఆ హీరోయిన్ కాలికి గాయం… కూల్ డ్రింక్‌తో చికిత్స చేసిన ఎన్టీఆర్‌

టాలీవుడ్‌లో దివంగ‌త న‌టుడు, విశ్వ‌విఖ్యాత న‌ట‌సౌర్వ‌భౌముడు ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ఆయ‌న ద‌శ‌దిశ‌లా చాటాడు. ఎన్టీఆర్ ఎంతో మంది హీరో, హీరోయిన్ల‌తో పాటు నిర్మాత‌లు, టెక్నీషియ‌న్ల‌కు లైఫ్ ఇచ్చారు. ఆయ‌న ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా సెట్స్లో పెద్ద‌, చిన్నా తేడా లేకుండా అంద‌రిని స‌మానంగా చూసేవారు.

Raja Makutam (1960)

 

ఇక హీరోయిన్ల‌ను ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా చూసుకునే వార‌ట‌. ఒక సినిమా షూటింగ్‌లో హీరోయిన్ కాలికి గాయం అయితే ఆయ‌నే స్వ‌యంగా చికిత్స చేయ‌డం అప్ప‌ట్లో ఓ విశేషం. 1959లో సొంత ఊరు సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఇది ఘంట‌సాల తీసిన రెండో సినిమా. రాజ సులోచ‌న హీరోయిన్‌. ఓ వైపు ఓ సెట్లో షూటింగ్ జ‌రుగుతుండ‌గానే.. అదే సినిమా కోసం ప‌క్క‌న మ‌రో సెట్ వేస్తున్నారు. ఆ సెట్‌కు సంబంధించి కొన్ని మేకులు ఇటు వైపు ప‌డ్డాయి.

BA Raju's Team Twitter પર: "64 years for Natarathna #NTR garu, Rajasulochana  starrer Successful Family Entertainer #Sonthavooru Directed by ESN Murthy  (23/05/1956)… https://t.co/h1gr3TjoiY"

అప్పుడే షూటింగ్ ముగించుకున్న రాజ సులోచ‌న అటుగా వ‌స్తుండ‌గా.. ఆ మేకు ఆమె కాలిలో దిగింది. రామారావు ఐస్ వేసిన కూల్ డ్రింక్ తెప్పించుకుని తాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సులోచ‌న కాలి నుంచి ర‌క్తం వ‌స్తోన్న విష‌యం గ‌మ‌నించారు. వెంట‌నే ఆ కూల్ డ్రింక్‌ను ఆ గాయం మీద వేశారు. త‌న చేతి గుడ్డ‌తో ఒత్తారు. వెంట‌నే రాజ సులోచ‌న త‌న‌కు గాయం అయిన విష‌యాన్ని తాను చూసుకోలేద‌ని చెపుతూ ఎన్టీఆర్‌కు ధ‌న్య‌వాదాలు చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news