Moviesచైతు - స‌మంత విడాకుల‌పై స‌మంత తండ్రి కామెంట్స్‌

చైతు – స‌మంత విడాకుల‌పై స‌మంత తండ్రి కామెంట్స్‌

అక్కినేని నాగచైతన్య-సమంత విషయంలో గత కొద్ది రోజులుగా విడాకులు తీసుకుంటార‌ని వ‌స్తోన్న వార్త‌లు ఎట్ట‌కేల‌కు నిజం అయ్యాయి. ఎట్ట‌కేల‌కు ఉత్కంఠ‌కు తెర‌దించుతూ వీరిద్ద‌రు విడిపోతున్న‌ట్టు చెప్పారు. అస‌లు విడాకుల‌కు కార‌ణం ఏమై ఉంటుందా ? అన్న‌ది మాత్రం ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. ఇక వీరి విడాకుల‌పై ఇప్ప‌టికే చైతు తండ్రి నాగార్జున స్పందించారు.

ఈ విడాకులు చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని.. భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య ఏదైనా జ‌రిగితే అది వారి వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని చెప్పారు. ఇక స‌మంత త‌మ కుటుంబంతో గ‌డిపిన క్ష‌ణాలు తాము ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేమ‌ని కూడా నాగ్ తెలిపారు. స‌మంత చైతు నుంచి విడిపోయినా కూడా ఆమె మాకు ఎప్ప‌ట‌కీ ప్రియ‌మైన వ్య‌క్తే అని… ఆమె మాకు ఆత్మీయురాలే అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ విడాకుల‌పై స‌మంత తండ్రి జోసెఫ్ ప్రభు స్పందించారు. ఈ విడాకుల వార్త తెలిసిన‌ప్ప‌టి నుంచి త‌న మైండ్ బ్లాక్ అయిపోయింద‌ని చెప్పాడు. అయినా స‌మంత అన్ని విధాలా ఆలోచించే ఈ నిర్ణ‌యం తీసుకుని ఉంటుంద‌ని.. త్వ‌ర‌లోనే అన్ని ప‌రిస్థితులు చ‌క్క‌ప‌డ‌తాయ‌ని ఆయ‌న చెప్పారు. ఇక రెండు రోజులుగా ఈ విడాకుల విష‌యంలో స‌మంత త‌ల్లిదండ్రులు సీరియ‌స్‌గా ఉన్నారంటూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news