Newsమ‌హేష్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌లో పునీత్ రాజ్‌కుమార్‌.. ఆ సినిమా ఏదో తెలుసా..!

మ‌హేష్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌లో పునీత్ రాజ్‌కుమార్‌.. ఆ సినిమా ఏదో తెలుసా..!

క‌న్న‌డ కంఠ‌రీవ అయిన దివంగ‌త లెజెండ్రీ న‌టుడు రాజ్‌కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో ఈ రోజు మృతి చెందారు. ఆయ‌న్ను విక్ర‌మ్ హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించినా అప్ప‌టికే ప‌రిస్థితి విష‌మించ‌డంతో మృతి చెందారు. ఇక క‌న్న‌డ ఇండ‌స్ట్రీ సీనియ‌ర్ హీరో రాజ్‌కుమార్ ఫ్యామిలీకి మ‌న టాలీవుడ్ టాప్ ఫ్యామిలీలు అయిన నంద‌మూరి, అక్కినేని, ఘ‌ట్ట‌మ‌నేని, కొణిదెల ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే పునీత్ రాజ్‌కుమార్ మెగా ఫ్యామిలీతో పాటు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబుతో ప్ర‌త్యేకంగా రిలేష‌న్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.

ఎన్టీఆర్‌తో త‌న ప‌వ‌ర్ సినిమాలో ఓ పాట‌ను పాడించుకున్న పునీత్ మ‌న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను క‌న్న‌డ‌లో రీమేక్ చేసి మ‌రీ హిట్ కొట్టారు. ఆ సినిమా ఏదో కాదు దూకుడు. శ్రీను వైట్ల – మ‌హేష్ కాంబోలో వ‌చ్చిన దూకుడు సినిమాను పునీత్ అక్క‌డ ప‌వ‌ర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం ఇచ్చారు.

ఈ ప‌వ‌ర్ మూవీ ఆడియో ఫంక్ష‌న్‌కు వెళ్లిన మ‌హేష్‌బాబు త‌న‌కు పునీత్‌తో ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం ఉంద‌ని.. ఆయ‌న ఎంత స్టార్ హీరో అయినా చాలా ఒదిగి ఉంటాడ‌ని.. ఇది వాళ్ల తండ్రి రాజ్‌కుమార్ నుంచే ఆ కుటుంబం అంద‌రికి వ‌చ్చిందంటూ మ‌హేష్ పునీత్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అలా వారిద్ద‌రికి ఎంతో అనుబంధం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news