Moviesమహేష్ బాబు మ‌రో మైల్ స్టోన్..స‌ర్కారు వారి పాట సాలిడ్ రికార్డు...

మహేష్ బాబు మ‌రో మైల్ స్టోన్..స‌ర్కారు వారి పాట సాలిడ్ రికార్డు ..!!

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తోన్న ఈ సినిమాపై లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి. మ‌హేష్ మూడు వ‌రుస హిట్ల‌తో ఫుల్‌స్వింగ్లో ఉన్నాడు. దీంతో స‌ర్కారు వారి పాట హిట్ అయితే మ‌హేష్ క్రేజ్ ఏ రేంజ్‌కు వెళ్లిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమా రేంజ్లో తీర్చిదిద్దేలా ప్లానింగ్ చేసి.. తెలుగు, త‌మిళ్‌, హిందీ మ‌ళ‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో త‌ప్ప‌నిస‌రిగా రిలీజ్ చేసేలా చూసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది.

కాగా మహేష్ బర్త్ డే కి టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బ్లాస్టర్ పేరిట రిలీజ్ చెయ్యగా దీనికి భారీ స్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మొట్టమొదటి 1 మిలియన్ లైక్డ్ రీజనల్ టీజర్ గా రికార్డు సెట్ చేసి భారీ వ్యూస్ ని కొల్లగొట్టిన ఈ టీజర్ .. ఇప్పుడు మ‌రో మైల్ స్టోనో సాధించడంతో మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 40 మిలియన్ వ్యూస్ అందుకొని సాలిడ్ రికార్డు సెట్ చేసింది మహేష్ బాబు హీరోగా నటిస్తున్న స‌ర్కారు వారి పాట సినిమా.

ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను స్పెయిన్‌లో జరిపారు. అందమైన లొకేషన్స్‌లో మహేష్ కీర్తి సురేష్ పైన డ్యూయట్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ ఇద్దరి కాంబో సన్నివేశాలు, అలాగే వీరిద్దరి మద్య సాగే లవ్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా ఉంటాయి అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news