Gossipsనటరాజ్‌ మాస్టర్‌ నాలుగు వారాలకు ఎంత పారితోషికం తీసుకున్నాడొ తెలిస్తే..ఖంగుతినాల్సిందే..?

నటరాజ్‌ మాస్టర్‌ నాలుగు వారాలకు ఎంత పారితోషికం తీసుకున్నాడొ తెలిస్తే..ఖంగుతినాల్సిందే..?

తెలుగులో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ మధ్యే ప్రారంభమైన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ ఏ చిన్న టాస్క్‌ ఇచ్చినా నువ్వానేనా అన్న రీతిలో పర్ఫామ్‌ చేస్తున్నారు. టైటిల్‌ ఎలాగైనా సాధించి తీరాలని కసితో ఆడుతున్నారు. దీంతో టాప్ టీఅర్పి రేటింగ్ లతో దూసుకుపోతుంది బిగ్ బాస్. మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రస్తుతం 15 మంది ఉన్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుండి నలుగురు కంటెస్టేంట్స్ ఎలిమినేట్ అయ్యారు.

మొదటి వారం సరయు ఎలిమినేట్ అవ్వగా..రెండో వారం కార్తీక దీపం ఫేమ్ అర్ధపావు భాగ్యం.. అలియాస్ ఉమాదేవి..మూడో వారం లేడీ అర్జున్ రెడ్డి లహరి..ఇక నాలుగో వారం డ్యాన్స్ మాస్టర్ నటరాజ్..ఇలా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. ఇక ఈ బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో నుంచి నాలుగోవారం ఎలిమినేట్ అవుతూ..కంటెస్టెంట్లందరికీ ఒక్కో జంతువు పేరిచ్చే నటరాజ్‌ మాస్టర్‌ తనకు తాను సింహం బయటకు వచ్చేసింది అని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈయన గేం స్ట్రాటజీ బాగున్నా..హౌస్ లో అందరితో ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసరికి అందరికి ఈయన తో మాట్లాడాలి అంటే భయమేసేది.

ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసిన నటరాజ్ మాస్టర్ రెమ్యూనరేష్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జోరుగా సగుతుంది. ఈయన మొత్తం నాలుగు వారాలకు గాను..షాకింగ్ పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశంగా ఈయన బిగ్ బాస్ హౌస్ లో గడిపిన నాలుగు వారాలకు గాను మొత్తంగా నాలుగు లక్షలు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువే ఎందుకంటే మార్కెట్ పరంగా చూసుకున్న మాస్టర్ కి అంత డిమాండ్ లేదు. ఇక మాస్టర్ ఇంటి నుండి ఎలిమినేట్ అయినా..తన ఇంటికి ఆనందంగానే వెళ్ళారు..ఎందుకంటే ఆయన భార్య నీతూ గర్భవతిగా ఉంది. ఈ టైంలో ఆయన ఆమె ప్రక్కన ఉండటం చాలా ఇంపార్టెంట్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news