Moviesఆదిపురుష్ నుండి అదిరిపోయే క్రేజీ అప్‌డేట్..ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు..!!

ఆదిపురుష్ నుండి అదిరిపోయే క్రేజీ అప్‌డేట్..ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు..!!

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు మన డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదల కానుంది. ఇక మరో పాన్ ఇండియా సినిమా ‘సలార్’. ఈ సినిమా కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది.

ఇక అంతేకాకుండా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతోన్న సినిమా ఆదిపురుష్‌. రామాయ‌ణంలోని ఓ ఘ‌ట్టం ఆధారంగా ఆదిపురుష్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తుండ‌గా… ప్ర‌తినాయ‌కుడు రోల్లో బాలీవుడ్ క్రేజీ హీరో సైఫ్ ఆలీఖాన్ న‌టిస్తున్నాడు. ఇక సీత పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటి కృతి సనన్ నటిస్తుంది. ప్రభాస్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాతంకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

ఈ చిత్రానికి సంబంధించి ఏ అప్‌డేట్ వ‌చ్చిన కూడా ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. ఇదిలా ఉంటే ఆదిపురుష్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆది పురుష్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్న సన్నీ సింగ్ పుట్టిన రోజును ‘ఆదిపురుష్’ టీం సెట్స్ లో ఘనంగా సెలెబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు లంకేశుడి పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ సీన్స్‌ను తెరకెక్కించేశామని, షూట్ పూర్తయిందని దర్శకుడు ఓం రావత్ ప్రకటించాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news