Gossipsపెళ్లి పీఠలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో..వధువు ఎవరంటే..?

పెళ్లి పీఠలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో..వధువు ఎవరంటే..?

టాలీవుడ్ వర్గాల పెద్దల నుండి అందుతున్న సమాచారం చూస్తుంటే.. మరో యంగ్ హీరో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నట్లు పక్కాగా తెలుస్తుంది. యస్.. మెగా సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత రెండు రోజుల నుండి మీడియా కోడైకూస్తుంది. పోనీ ఈ వార్తలు పై మెగా ఫ్యామిలీ స్పందించి..అవన్నీ పుకార్లు నమ్మద్దు అని కూడా చెప్పకపోవడంతో..తోటి నటినటులు కూడా సాయి పెళ్ళి చేసుకోబోతున్నాడు అంతూ ఫిక్స్ అయిపోయారు.

కాగా ఇటీవ‌ల ఘోర ప్రమాదం నుండి భయటపడ్డ సాయి రీసెంట్ గానే కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నాడు. సాయిధరమ్ తేజ్ ఐకియా సమీపంలో బైక్ యాక్సిడెంట్‌కు గురై హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుని ప్రాణా పాయం నుంచి బ‌య‌ట ప‌డిన సంగ‌తి తెలిసిందే. పూర్తి ఆరోగ్యంతో ఈ హీరో ఇంటికి తిరిగొచ్చాడు కూడా. నెలరోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న.. సాయిధరమ్ డిశ్చార్జ్ అయిన విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలిపారు. త్వరగా సాయి కోలుకోవాలని కోరాడు.

ఇటీవల సాయిధరమ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా హీరోలు, ఫ్యామిలీ అంతా కలిసి అతడికి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిహారిక నుంచి మొదలు కొని శ్రీజ, వరుణ్ తేజ్, ఇతరులు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సాయిధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా అల్లు శిరీష్ చేసిన పోస్ట్ సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది.

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

‘ఒంటరి వ్యక్తిగా ఇది మీ చివరి పుట్టినరోజు అని నేను ఆశిస్తున్నాను. త్వరలో మీరు మీ వివాహ వార్తలతో ముందుకు వస్తారు’ అని సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ మ్యాన్ కావాలంటూ అల్లు శిరీష్ చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. త్వరలోనే సాయిధరమ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నట్టు దీని ద్వారా క్లారిటీ వచ్చేసింది .కాగా.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఈ ఏడాది సాయితేజ్ పెళ్లి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది వ‌ర‌కే సాయిధ‌ర‌మ్ లారిస్సా బోనెసి.. అనే బ్రెజిలియ‌న్ మోడ‌ల్‌.. హీరోయిన్‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని..వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయమై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news