Moviesషాకింగ్: జయసుధ ఇలా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా..??

షాకింగ్: జయసుధ ఇలా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా..??

తెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటి జయసుధ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. ఆమె పేరే సహజ నటి. అక్కినేని నాగేశ్వరరావు లాంటి అగ్ర నటులు సైతం ఆమె నటనకు కితాబు ఇచ్చినవారే. ఆమె తమ సినిమాలో ఉంటే హిట్ గ్యారంటీ అని టాప్ హీరోలు ఒకనాడు ఆమె కాల్షీట్ల కోసం ఎదురుచూసిన వారే కావడం విశేషం. ఇక తెలుగు తమిళ రంగాలలో ప్రఖ్యాత డైరెక్టర్లు తమ సినిమాలలో ఆమెను హీరోయిన్ గా తీసుకుని వరస హిట్లు కొట్టారు.

అద్భుతమైన నటనతో దశాబ్దాల పాటు ఆమె తెలుగు ప్రేక్షకులను ఓలలాడించారు. ఎన్టీఆర్, ఏన్నార్, శోభన్ బాబు వంటి అగ్రహీరోల సరసన ఆడిపాడారు. ప్రస్తుత హీరోలకు అమ్మ పాత్రల్లో అద్బుతంగా ఇమిడిపోయారు. ఇక నయా జనరేషన్ హీరోలకు అమ్మమ్మ, నాన్నమ్మ పాత్రలు వేస్తున్నారు ఆవిడ. అయితే ఏ పాత్ర వేసినా దానికి తనదైన మార్క్ వెయిట్ తీసుకొస్తారు జయసుధ. దక్షిణాదిలో సహజనటి గా తనకు సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నా.. జయసుధ మాత్రం ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలను అవకాశాలను కోసం ప్రయత్నిస్తూ కెరీర్ బిల్డ్ చేసుకుంది.

అయితే గత రెండేళ్లుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ముఖ్యంగా భర్త నితిన్ కపూర్ మరణం తర్వాత ఈమెకు సినిమాలపై ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. కాగా ఆమెకు సంబంద్జించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు ఆ ఫోటోస్ చూసిన వారు ఈమె మా జయ సుధానేనా అని అనిపించేలా ఉన్నాయి. ఒక్కపూడు జయసుధకి ఇప్పుడు ఫోటోస్ లో ఉన్న జయసుధని చూస్తే..

జయసుధ గారు ఇలా అయిపోయారేంటి అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈమె ఇండియాలో లేరు. అమెరికాలో ఉన్నారు. అక్కడే కొన్ని రోజులుగా ఉంటున్నారు ఈమె. అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్న పిల్లల కోసం ఓ స్వచ్ఛంద సంస్థను కూడా మొదలు పెట్టారు జయసుధ. అయితే ఈమె ఇంతగా మేకోవర్ రావడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. ఏదైనా అనారోగ్యం పాలయిందా లేదంటే వయసు రీత్యా ఇలా మారిపోయిందా అనే విషయాలు అంతు చిక్కడం లేదు. ఏదేమైనా జయసుధ లేటెస్ట్ ఫోటోస్ మాత్రం అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news