Moviesరెండు వారాలకు ఇంత డబ్బులా..వామ్మో భాగ్యం పని బాగుందే..??

రెండు వారాలకు ఇంత డబ్బులా..వామ్మో భాగ్యం పని బాగుందే..??

తెలుగులో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ మధ్యే ప్రారంభమైన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ ఏ చిన్న టాస్క్‌ ఇచ్చినా నువ్వానేనా అన్న రీతిలో పర్ఫామ్‌ చేస్తున్నారు. టైటిల్‌ ఎలాగైనా సాధించి తీరాలని కసితో ఆడుతున్నారు. దీంతో టాప్ టీఅర్పి రేటింగ్ లతో దూసుకుపోతుంది బిగ్ బాస్. మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రస్తుతం 17 మంది ఉన్నారు.

 

మొదటి వారం సరయు ఎలిమినేట్ అవ్వగా..రెండో వారం కార్తీక దీపం ఫేమ్ అర్ధపావు భాగ్యం.. అలియాస్ ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. తనదైన ఆట తీరుతో హౌస్‌లో పెద్దగా వ్యవరిస్తూ బాగా ఆడినప్పటికి.. అయితే ఊహించని విధంగా టాస్క్‌లసమయంలో అగ్రసివ్‌గా ఉండటం.. బూతులు మాట్లాడటం ఆమెకు మైనస్ అయ్యింది. దాంతో హౌస్‌లో రెండు వారాలు ఉన్న ఉమా దేవి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఉన్నది రెండువారాలే అయినా హౌస్‌లో ఒక్కొక్కరినీ గడగడలాడించి అందరినీ ఠారెత్తించింది. నామినేషన్స్‌ వస్తే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోయేది.

అయితే, అర్ధపావు భాగ్యం రెండు వారాలు బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసినందుకు గాను ఉమాదేవి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా..?? సుమారు రూ. లక్షా అరవై వేల రూప్పాయలు పారితోషికంగా తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు..బిగ్‌బాస్‌ ద్వారా తనకు వచ్చిన పారితోషికంలో కొంత మొత్తాన్ని బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు అందించి ఉమా నోరే కాదు మనసు కూడా పెద్దదే అని అనిపించుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news