MoviesBigg Boss Telugu 5: షణ్ముఖ్ తో మాట్లాడుతున్నప్పుడు నాగార్జున చేసిన...

Bigg Boss Telugu 5: షణ్ముఖ్ తో మాట్లాడుతున్నప్పుడు నాగార్జున చేసిన ఈ అతి పెద్ద తప్పును మీరు గమనించారా.?

తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 5 కలర్ ఫుల్ గా స్టార్ట్ అయ్యింది. హోస్ట్ నాగార్జున ‘టన్నుల కొద్దీ కిక్’ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి.. 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్‏బాస్ హౌస్ లో సందడి మొదలైయింది. మున్నటి వరకు వరకు కంటెస్టెంట్లు ఎవరా అనే అనుమానాల ప్రచారం నుండి ఇప్పుడు కంటెస్టెంట్లు ఎవరో ఉత్కంఠ వీడి అందరినీ ఇంట్లోకి పంపేసి గొళ్ళెం పెట్టేశారు. ఇందులో నాగార్జున హోస్ట్ గా ఒక్కొక్క హౌస్ మేట్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తూ తనదైన స్టైల్లో యాంకరింగ్ చేశారు.

 

ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అయితే షన్ను అదేనండి షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు పాపులర్ యూట్యూబర్‏గా బుల్లితెరపై అత్యంత ఫేమస్ అయిన బిగ్‏బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. షణ్ముక్ జస్వంత్ హూఆర్ యూ అనే సాంగ్ కి పెర్ఫామ్ చేస్తూ తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశాడు. ఇక్కడే నాగార్జున చాలా సరదాగా షణ్ముక్ ని పలకరించారు.

బిగ్ బాస్ లో నెగిటివిటి కూడా ఉందంటూ షణ్ముఖ్ జస్వంత్ తో నాగార్జున కొంచెం సేపు ముచ్చటించారు.ఇక ఈ క్రమంలో మాట్లాడేటప్పుడు నాగార్జున ఒక పెద్ద పొరపాటు చేశారు. అదేంటంటే షణ్ముఖ్ అంటే ఆరు ముఖాలు ఉన్నవారు. మామూలుగా బ్రహ్మదేవుడికి కూడా మూడు ముఖాలు ఉంటాయని నోరుజారారు కింగ్ నాగార్జున. నిజానికి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు, చతుర్భుజుడు. బ్రహ్మకి నాలుగు ముఖాలు ఉంటాయి. ఈ నాలుగు ముఖాలు నాలుగు వేదాలను సూచిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన నెటిజన్లు నాగర్జున ని నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’, ‘సూర్య’ లాంటి సిరీస్ లతో షణ్ముఖ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news