Gossipsఫస్ట్ టైం ఆ హీరోయిన్ విషయంలో చరణ్ కు సలహా ఇచ్చిన...

ఫస్ట్ టైం ఆ హీరోయిన్ విషయంలో చరణ్ కు సలహా ఇచ్చిన పవన్..??

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిగ్గెస్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో హుషారెత్తించబోతున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్న ఆయన.. మరో బడా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను లైన్‌లో పెట్టేశారు. దీంతో ఈ రెండు సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్‌సి 15” అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు గాను అమె షాకింగ్ రెమ్యునరెషన్ తీసుకుంటున్నట్లు సమాచరం. ఈ భారీ యాక్షన్ డ్రామాలో చరణ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కియారా అద్వానీ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉమదట. ఆమె మరెవరో కదు రీసెంట్ గా వకిల్ సాబ్ సినిమాతో కెరీర్ లోనె బ్లాక్ బస్టర్ హిట్ రుచి చూసిన అంజలి. సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది.

వకిల్ సాబ్ లో ఆమె నటనకు ఫిదా అయిన పవన్.. ఈ క్రమంలోనే పవన్ ఆమెకి “ఆర్‌సి 15” లో అవకాశం ఇచ్చి చూడమన్నట్లు టాఖ్ వినిపిస్తుంది. ఇక శంకర్ కూడా దీనికి ఒకే చెప్పిన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌ పక్కన రెండో హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేశారట డైరెక్టర్ శంకర్. కియారాకు ఇచ్చినట్లుగానే అంజలికి కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట దర్శకనిర్మాతలు. ఏది ఏమైనా వకీల్ సాబ్ తో అంజలి దశ తిరిగిందనే అంటున్నారు నెటిజన్స్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news