Gossipsచిరంజీవికి భారీ షాక్ ..‘గాడ్ ఫాదర్’కు షూటింగ్ కు బ్రేక్..?

చిరంజీవికి భారీ షాక్ ..‘గాడ్ ఫాదర్’కు షూటింగ్ కు బ్రేక్..?

మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే షురూ అయింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్ ఆగిపోయిందట. దానికి కారణం ఈ చిత్రానికి కెమెరామెన్‌గా చేస్తున్నా నీరవ్ షా . ఆయన తమిళంలో అజిత్ హీరోగా వస్తున్న ‘వాలిమై’కు కూడా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే పని మీద నాలుగు రోజుల షూట్ కోసం ఆయన చెన్నై వెళ్లారట. సో.. చిరంజీవి సినిమా షూటింగ్‌ను నీరవ్ లేని కారణంగా ఆపారనే టాక్ వైరల్ గా మారింది.

అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా ఒరిజిన‌ల్ వెర్ష‌న్ లో పృథ్విరాజ్ సుకుమార‌న్ చేసిన పాత్ర కోసం ..బాలీవుడ్ కండల వీరుడు ..స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ను అనుకున్నారట. అయితే ఆయన నో చెప్పారని.. ఎందుకంటే.. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమార్ పాత్ర నిడివి 5 నిమిషాలే ..అందుకే సల్మాన్ అంతగా ఇంట్రస్ట్ చూపించట్లేదని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తరుణంలోనే..చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీలో డాన్ పాత్రను సల్మాన్ ఖానే ఓకే చేసారనే టాక్ బయటకి వచ్చింది. ఈ మేరకు అతడు రెండు రోజుల క్రితమే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

నిజానికి స‌ల్మాన్‌ఖాన్‌, చిరంజీవి జాన్ జిగిడి దోస్త్ లు…. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమార్ పాత్ర నిడివి 5 నిమిషాలే అయినా సినిమా చివరి వ‌ర‌కు ఆ పాత్ర ట్రావెలింగ్ అవుతుంది. అందుకే స‌ల్మాన్ యస్ చెప్పారని సినీ ఇండస్ట్రీ టక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news