Moviesబన్నీ అభిమానులకు గుడ్ న్యూస్..ఈ క్రెడిట్ అంతా మీకే..!!

బన్నీ అభిమానులకు గుడ్ న్యూస్..ఈ క్రెడిట్ అంతా మీకే..!!

అల్లు అర్జున్‌ ఈ పేరుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి..క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దక్షిణాదిలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోలలో బన్నీ ముందుంటాడు అని చెప్పుకోవాలి. అటు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‏గా ఉంటాడు బన్నీ. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏదైనా కూడా ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో రికార్డులు సృష్టించడం బన్నీ కే సొంతం.

ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన బన్నీ.. తాజాగా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలోనే ఏ హీరోకు సాధ్యం కాని..కని విని ఏరుగని రీతిలో సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ సంపాదించుకుని బన్నీ ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసారు. తాజాగా ఈ హీరో తన ఇన్‏స్టాలో ఏకంగా 13 మిలియన్ ఫాలోవర్స్‏ను కలిగి ఉన్నారు. అంటే నెట్టింట్లో బన్నీకి దాదాపు 1 కోటి 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో ఈ రికార్డును అందుకున్న తొలి హీరోగా బన్నీ రికార్డ్ సృష్టించాడు.

ఇదంతా తను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను తెరిచిన నాలుగేళ్లలోనే అల్లు అర్జున్‌ ఈ ఘనత సాధించడం విశేషం. 2017వ సంవత్సరం నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చారు అల్లు అర్జున్. అలా క్రమంగా తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ ప్రస్తుతం ఏకంగా 13 మిలియన్ మైలురాయిని అందుకున్నారు అల్లు అర్జున్. ఈ ఘనతను సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరో అయ్యారు బన్నీ. దానితో ఇప్పుడు తన అభిమానులు అల్లు అర్జున్‌ను ‘సౌత్ కా సుల్తాన్’ అని పిలుస్తున్నారు. ఇక ఇదే విషయంపై అల్లు అర్జున్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు తన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు అని అల్లు అర్జున్ తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news