Moviesపాప యమ స్పీడ్ గా ఉందే.. లీకైన స్టార్ డాటర్ రొమాంటిక్...

పాప యమ స్పీడ్ గా ఉందే.. లీకైన స్టార్ డాటర్ రొమాంటిక్ మాటలు..!!

బాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో సారా అలీ ఖాన్ ఒకరు. సైఫ్ అలీ ఖాన్ కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమా ‘కేదార్ నాథ్’ తోనే ఒక విజయం తన ఖాతాలో వేసుకుంది. రెండో సినిమా ‘సింబా కూడా సూపర్ హిట్ అయింది. హిట్ సినిమాలు, సారా అందం ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చి పెట్టింది. బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ వరుస సినిమాలతో బిజిబిజీగా గడిపేస్తున్నారు.

సాధారంగా బాలీవుడ్ లో చాలామంది స్టార్ కిడ్స్ ఉన్నారు కానీ వారిలో సక్సెస్ అయిన వారు మాత్రం తక్కువ మందే. అలాంటి తక్కువ మందిలో సారా అలీ ఖాన్ కూడా ఉంటుంది. ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన హాట్ ఫోటో లను పోస్ట్ చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంది.

కేథార్ నాథ్ చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసిన సారా అలీఖాన్ ఆ సినిమాలో నటించే సమయంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. ఆ ప్రేమకథ ముగిసింది అనగానే గత సంవత్సరం `లవ్ ఆజ్ కల్ 2` కోస్టార్ కార్తీక్ ఆర్యన్ తో లవ్ లో పడిందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

దానికి తగ్గటుగానే వాళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ రియల్ కపుల్ నే మించిపోయింది. అంతేకాదు ఆర్యన్ సారా ఫ్యామిలీతో కూడా బాండింగ్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు బాలీవుడ్ టాక్. ఒకానొక టైంలో వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, సడెన్ గా.. ఈ జంట విడిపోయినట్లు బాలీవుడ్ మీడియాలో కధనాలు వినిపించాయి.

అయితే తాజాగా ఇప్పుడు మరో కొత్త ప్రేమకథ తెరపైకొచ్చింది. సారా `కేదార్ నాథ్` అసిస్టెంట్ డైరెక్టర్ జెహన్ హండా మధ్య రొమాంటిక్ సంభాషణలు లీకయ్యాయి. జెహాన్ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఇద్దరి మనోహరమైన బీచ్ ఫోటోను షేర్ చేసాడు. దీనికి బాలీవుడ్ పాప సారా.. తన ఇన్ స్టాగ్రామ్ లో LOVE YOU..TAKE ME BACK అని GIF లతో తిరిగి పోస్ట్ చేసింది. ఇంకేముంది సారా – జెహన్ రొమాంటిక్ ఫోటోలు బయటపడడంతో ఆ ఇద్దరి మధ్య ఇష్క్ స్టార్ట్ అయ్యిందంటూ బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news