Moviesకామ్నా జెఠ్మలానీ సినిమాను కొట్టేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే...

కామ్నా జెఠ్మలానీ సినిమాను కొట్టేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

కామ్నా జెఠ్మలానీ.. ఓ అందాల తార. ఈ పేరు వింటేనే మనకు గుర్తు వచ్చేది ఆమె సొట్ట బుగ్గలు. ఆమె నవ్వుకి కుర్రకారు ఫిదా అయ్యిపోవాల్సిందే. టీనేజ్​ వయసులోనే మిస్ ముంబయిగా నిలిచి, తెలుగు సినిమాలో అవకాశం దక్కించుకుని హీరోయిన్​ అభిమానుల మనసుల్ని అలరించింది ముద్దుగుమ్మ కామ్నా జెఠ్మలానీ.

స్టార్ హీరోయిన్ కామ్నా జఠ్మలానీతండ్రి నిమేష్ జఠ్మలానీ బిజినెస్ మెన్. ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్. కామ్నా జఠ్మలానీ, రామ్‌జెఠ్మలానీకి మనుమరాలు అవుతుంది. రామ్‌ జెఠ్మలానీ గురించి తెలియని వారంటూ ఉండారు. దేశంలో ప్ర‌ముఖ న్యాయ‌కోవిదుడిగా రామ్ జెఠ్మ‌లానీకి ,మంచి గుర్తింపు ఉంది. ఆయన వాజ‌పేయీ ప్ర‌భుత్వంలో కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు. కేవ‌లం 17 ఏళ్ల వ‌య‌సులోనే రామ్‌జెఠ్మలానీ న్యాయ‌వాదిగా ప్రాక్టీసును ప్రారంభించారు.

కామ్నా జట్మాలాని … తెలుగు ప్రేక్షకులకే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ .. 2014లో బెంగుళూరుకు చెందిన పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్పాల్ ను వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అంతేకాదు ఈ సుందరాంగి వ్యాపారం వైపు అడుగులు వేసింది.

ఆమె నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకటుకున్నారు. ఆమె తెలుగులో ‘రణం’, ‘సామాన్యుడు’, ‘బెండు అప్పారావు’, ‘కత్తి కాంతారావు’, ‘జగద్గురు ఆదిశంకర’ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నరు కామ్నా జఠ్మలానీ ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈమె ఆలీతో సరదాగా షో లో పాల్గొనగా తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.

కామ్నా జెఠ్మలానీ..దాదాపు 500 వరకు స్టేజి షోలు చేశారట. ఇక ఈ అమ్మడు సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేదట. అలా అందులో తను అందుకున్న మొదటి పారితోషికం 300 అని తెలిపింది. బెస్​ఫ్రెండ్​, నటి పూనమ్ బజ్వా అని, అల్లరి నరేశ్, దేవిశ్రీ ప్రసాద్, శ్రద్ధాదాస్​తో పాటు మరికొందరు కూడా టాలీవుడ్​లో ఫ్రెండ్స్​ అని కామ్నా చెప్పుకొచ్చింది.

డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల కృష్ణవంశీ ‘చందమామ’ సినిమాలో చెయ్యలేకపోయానని.. మరో నాలుగైదు పెద్ద చిత్రాల్లోనూ ఛాన్స్​లు మిస్సయ్యాయని బాధపడ్డింది. ఇక్ ఈ బ్యూటీకి పూరీ జగన్నాథ్, రాజమౌళి సినిమాల్లో నటించాలని ఉందట. ఇలా తన వ్యక్తిగత జీవితం గురించి అలీ తో పంచుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news