Moviesతన కెరీర్ మొత్తంలో ఆమని ఆ స్టార్ హీరోతో ఒక్క సినిమా...

తన కెరీర్ మొత్తంలో ఆమని ఆ స్టార్ హీరోతో ఒక్క సినిమా కూడా చేయలేదు.. ఎందుకంటే..??

అలనాటి అందాల తారల్లో ఆమని ఒకరు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగులో సంచలన సినిమాలు చేసింది. ముఖ్యంగా 90 ల్లో ఈమె చేసిన పాత్రలు.. సినిమాలు ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతాయి. గడసరి పెళ్లాం పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఆమని. జగపతిబాబు కాంబినేషన్‌లో ఆమని చేసిన సినిమాలు చరిత్ర తిరగరాసాయి.

శుభలగ్నంలో భర్తను అమ్ముకునే పాత్ర అయినా.. మావిచిగురులో భర్తపై చచ్చేంత ప్రేమ ఉన్న గడసరి పెళ్లాం పాత్ర అయినా.. ఘరానా బుల్లోడులో పాలమ్ముకునే పాప పాత్ర అయినా అన్నింట్లోనూ ఆమని అదరహో అనిపించింది. హోమ్లీ కారెక్టర్స్‌లోనే ఈమెను ప్రేక్షకులు కూడా ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారు.

ఆమని తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్. ఇక ఆమని జంబలకిడిపంబ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత ఆమని వెనుతిరిగి చూసుకోలేదు. కొద్ది రోజుల్లోనే టాప్ హీరోయిన్ గా రాణించారు. ఆమని టాప్ హీరోలందరి సరసన నటించింది.

కానీ చిరంజీవితో మాత్రమే తను సినిమా చేయలేదు. చిత్ర పరిశ్రమలో మంచి బిజీగా ఉన్న సమయంలోనే తను ప్రేమ వివాహం వేసుకున్నారు. దాంతో తను చిరంజీవితో ఆడిపాడలేకపోయారు.

హీరోయిన్ గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమని ఆతర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగానే ఉన్న ఆమని.. ఇప్పుడు మళ్లీ వరస సినిమాలు చేస్తుంది. తాజాగా చావు కబురు చల్లగా సినిమాలో చేసింది ఆమని. అందులో హీరో కార్తికేయ తల్లిగా నటించింది ఈమె. ఆమనికి కొడుకు, కూతురు ఉన్నారు.

వెబ్ సిరీస్ లో జగపతి బాబుకు జోడీగా అలనాటి అందాల నటి ఆమని కనిపించనున్నారు. ఆమని ఇటీవలే ‘చావు కబురు చాల్లాగా’అనే సినిమాలో కీలక పాత్రలో నటించారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్న ఆమని ‘చావు కబురు చాల్లాగా’ మూవీలో హీరో తల్లిగా నటించారు.

ఇక జగపతి బాబు ఆమనిలది హిట్ పెయిర్. ఈ ఇద్దరు కలిసి నటించిన ‘శుభలగ్నం’ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.

ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. ‘ఆహా’ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సిరీస్ లో జగపతి బాబుకు జోడీగా నటిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో ఆమనీ బోల్డ్ గా నటించనున్నారంట. ఆహాలో త్వరలో ఆ ప్రాజెక్ట్ రాబోతున్నట్లుగా ఆమని పేర్కొన్నారు. జగ్గూభాయ్, ఆమని పెయిర్ మరోసారి సందడి చేయడం ఖాయం అని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news