Moviesఈ హీరోయిన్ ఎవరో మీరు గుర్తు పట్టారా..??

ఈ హీరోయిన్ ఎవరో మీరు గుర్తు పట్టారా..??

ఇండస్ట్రీలో హీరోయిన్స్ టైం పీరియడ్ వెరీ షార్ట్.. ఫేం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కానీ అందరికీ ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. కొందరు హీరోయిన్లు ఒక రెండు సినిమాలతో ఫెడ్‌‌అవుట్ అయిపోతారు. ఆలాంటి జాబితా కిందికే వస్తుంది ఈ అల్లరి నరేష్ హీరోయిన్ శేరిన్ శృంగార్..

కన్నడ ప్రముఖ హీరో దర్శన్ నటించిన ధ్రువ మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చిన శేరిన్ శృంగార్ టాలీవుడ్ లో జూనియర్స్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. 2002లో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా చేసింది. జె. పుల్లారావు దర్శకత్వంలో అల్లరి నరేష్, శేరిన్, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, వైజాగ్ ప్రసాద్, సుధాకర్ బేతా, జూనియర్ రేలంగి, గౌతంరాజు, బెనర్జీ, లక్ష్మీపతి తదితరులు నటించారు.

తెలుగు,కన్నడ,మలయాళం భాషల్లో కొంతకాలం బాగానే ఛాన్స్ లు తెచ్చుకున్న ఈమె సడన్ గా సినిమాలకు దూరమైంది. సినిమాలు తగ్గుముఖం పట్టడంతో బుల్లితెర వైపు వెళ్ళింది.

పలు తెలుగు సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినప్పటికీ వదిలేసుకుంది. దానికి తోడు ఆమె నటించిన ఐదారు సినిమాలు ఘోరంగా దెబ్బతినడంతో ఇక ఛాన్స్ లు రాకుండా పోయాయి. దాంతో బుల్లితెరవైపు అడుగులు వేసిన శేరిన్ శృంగార్ పలు డాన్స్ షోస్ కి జడ్జిగా వ్యవహరించింది. తమిళ బిగ్ బాస్ రియాల్టీ షో లో కంటెస్టెంట్ గా చేసింది. ప్రస్తుతం ఐదారు ధారావాహికలలో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటూ అభిమానులను అలరిస్తుంది.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news