Moviesఈ బుడ్డోడు మామూలోడు కాదండోయ్ ...!!

ఈ బుడ్డోడు మామూలోడు కాదండోయ్ …!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. తెలుగు ఆడియన్స్‌ మాత్రమే కాదు.. ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ RRR. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ భారీ చిత్రం కోసం ఇండస్ట్రీ జనాలు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి జక్కన్న చెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్ డేట్ తెగ ట్రెండ్ అవుతూనే ఉంది.

అయితే కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇపుడిప్పుడే మళ్లీ సాధారణ పరిస్ధితులు రావడంతో.. తిరిగి షూఊటింగులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇక మన జక్కన్న కూడా ‘RRR’ షూటింగ్ ని మొదలుపెట్టాడు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు సెట్ లో అడుగు పెట్టడం జరిగింది.ఇక తాజగా రామ్ చరణ్ సెట్ లో అడుగు పెట్టగా..వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి.

రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. చరణ్ పక్కన ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా ఒక బుడ్డోడు మరింత స్టైలిష్ గా కనిపించేలా డ్రెస్ అప్ అయ్యి జేబులో చేయి పెట్టుకుని మరీ చరణ్ తో మాట్లాడుతూ కనిపించాడు. అయితే నెట్టింట్లో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతుండటంతో ఫోటోలో చరణ్ పక్కన ఉన్న ఆ చిన్నోడు ఎవరా అని చాలామంది అరా తీశారు.

స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఆ అబ్బాయి సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. క‌థ ప్ర‌కారం అల్లూరి సీతారామ‌రాజు కుర్రాడిని ర‌క్షిస్తార‌ట‌. గ‌తంలో వీరిద్ద‌రిపై కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌గా, తాజాగా షెడ్యూల్‌లో రామ్ చ‌ర‌ణ్‌, పిల్లాడి కాంబినేష‌న్‌లో మిగ‌తా సీన్స్ షూట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే షూటింగ్ స‌మ‌యంలో తీసిన ఫోటోసే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఫొటోలో రామ్ చ‌ర‌ణ్ ఎంత హైలైట్ అయ్యాడో అంత‌కుమించి హైలైట్ అయ్యాడు ఆ బుడ్డోడు.

‘2 పాటలు మినహా.. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పూర్తయ్యిందని.. హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లు రెండు భాషల్లో డబ్బింగ్ కూడా ఫినిష్ చేసారని.. మరికొద్ది రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతాయని’ ట్విట్టర్ ద్వారా ‘ఆర్.ఆర్.ఆర్’ టీం తెలిపింది. అక్టోబర్ 13 దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే విడుదల తేదికి సినిమాను విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news