Moviesవ్య‌భిచారంలో దొర‌క‌డంతో ఈ తెలుగు హీరోయిన్ కెరీర్ అలా ముగిసిందా...!

వ్య‌భిచారంలో దొర‌క‌డంతో ఈ తెలుగు హీరోయిన్ కెరీర్ అలా ముగిసిందా…!

సినిమారంగంలో హీరో, హీరోయిన్లుగా వెలుగొందాలని ఎంతోమంది తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ఈ రంగుల ప్రపంచం లోకి ఎంట్రీ ఇస్తారు. అయితే ఇక్కడ కొంతమందికి మాత్రమే ఛాన్స్‌ దొరుకుతుంది. మిగిలిన వాళ్ళు ఒక‌టి అరా అవకాశాలు అందిపుచ్చుకుని ఆ తర్వాత క ఛాన్సులు లేక ఇండస్ట్రీకి దూరమై పోతారు. మరికొందరు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుల‌గానూ.. ఇతర బుల్లితెర కార్యక్రమాల్లోనూ బిజీ అవుతారు. మరికొందరు మాత్రం అవకాశాలు లేక అడ్డదారులు తొక్కి అయినా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అయితే ఇలాంటి వారి జీవితం ఎప్పటికి అయిన తలకిందులు అవ్వక తప్పదు.

 

ఓ తెలుగు సినిమా హీరోయిన్ జీవితం సైతం ఇలాగే ముగిసింది. అప్పట్లో ప్రముఖ దర్శకుడు వేమూరి జ్యోతీంద్ర‌నాథ్‌ దర్శకత్వం వహించిన కుంకుమ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అయింది జ‌య‌ల‌క్ష్మి అలియాస్ సీమ‌. కెరీర్ ప్రారంభంలో కొన్ని ఛాన్సులు ద‌క్కించుకున్నా ఆ త‌ర్వాత ఆమె సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి. శ్రీకాంత్ ప‌క్క‌న కూడా ఓ సినిమా చేసింది. ఆ త‌ర్వాత ఆమె ఓ హోటల్లో వ్య‌భిచారం చేస్తూ పోలీసుల రైడ్‌లో దొరికింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

 

అంతే కాకుండా ఆమె ప‌లు ఆర్థిక‌ప‌ర‌మైన మోసాల‌కు పాల్ప‌డిన‌ట్టు కూడా పోలీసులు అప్ప‌ట్లో చెప్పారు. ఆమె వ్య‌భిచారం చేయ‌డంతో పాటు మ‌రి కొంద‌రు యువ‌తుల‌ను కూడా ఈ వృత్తిలోకి దింపాల‌ని చూసిందన్న టాక్ కూడా వ‌చ్చింది. కుంకుమ‌, అడ‌వి రాముడు, త‌ప‌న, కాళీ సినిమాల్లో న‌టించిన ఈ అమ్మ‌డు జీవితం ఈ సంఘ‌ట‌న త‌ర్వాత పూర్తిగా నాశ‌నం అవ్వ‌డంతో ఆమె ఇండ‌స్ట్రీకి దూర‌మైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news