Moviesఆ అట్ట‌ర్ ప్లాప్ సినిమాతో నాలో మార్పు... మ‌హేష్ సంచ‌ల‌న ట్వీట్‌

ఆ అట్ట‌ర్ ప్లాప్ సినిమాతో నాలో మార్పు… మ‌హేష్ సంచ‌ల‌న ట్వీట్‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కెరీర్‌లో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా ఖ‌లేజా. 2010లో అక్టోబ‌ర్ 7న భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. మ‌హేష్ న‌టించిన అతిథి సినిమా 2007లో వ‌చ్చింది. ఆ సినిమా ప్లాప్ త‌ర్వాత మూడున్న‌రేళ్ల పాటు లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌రీ మ‌హేష్ ఖ‌లేజా చేశాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌.

 

 

రిలీజ్‌కు ముందు ఖ‌లేజాకు వ‌చ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ప్లాప్ అయినా మ‌హేష్‌లో ఓ క‌మెడియ‌న్ కూడా ఉన్నాడ‌ని చెప్పింది. మ‌హేష్ న‌ట‌న, డైలాగ్ డెలివ‌రీ అన్ని కొత్త‌గా ఉన్నాయి. అయితే క‌థను ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేలా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు ఫెయిల్ అవ్వ‌డంతో సినిమా ఆడ‌లేదు. ఈ సినిమాలో మ‌హేష్‌కు పెద్ద‌గా డైలాగులు కూడా ఉండ‌వు. అయితే చిన్న చిన్న డైలాగులు సైతం పంచ్‌లుగా బాగా పేలాయి.

 

 

ఈ సినిమా వ‌చ్చి ప‌దేళ్లు అయిన సంద‌ర్భంగా మ‌హేష్ ఈ సంద‌ర్భంగా ట్వీట్ చేశాడు. ఖ‌లేజా నటుడిగా నన్ను మార్చిన సినిమా అని చెబుతూ, నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంన‌డంతో పాటు ఇందుకు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌కు థ్యాంక్స్ చెప్ప‌డంతో పాటు త్వ‌ర‌లోనే త్రివిక్ర‌మ్‌తో త‌న సినిమా ఉంటుంద‌ని చెప్పాడు. మ‌హేష్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న ఇప్పుడు మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news