Moviesతార‌క్ ఫ్యాన్స్ ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌... కోరిక తీర్చేస్తున్నాడు...!

తార‌క్ ఫ్యాన్స్ ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌… కోరిక తీర్చేస్తున్నాడు…!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్ప‌టికే ఐదు వ‌రుస హిట్ల‌తో మంచి జోరు మీదున్నాడు. అర‌వింద స‌మేత త‌ర్వాత ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు మ‌రో యంగ్ క్రేజీ హీరో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీంగా క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

 

ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి చ‌ర‌ణ్ వార్త‌లు బ‌య‌ట ఎక్కువుగా ఫోక‌స్ అవుతున్నాయి. రాజ‌మౌళి ఎన్టీఆర్ విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు కాస్త ఇబ్బంది ప‌డుతూనే ఉన్నాడు. చ‌ర‌ణ్ బ‌ర్త్ డేకు ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌తో వీడియో కూడా రిలీజ్ చేశాడు. చ‌ర‌ణ్ రోల్‌కు ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్ వాయిస్ తోడ‌వ్వ‌డంతో చ‌ర‌ణ్ లుక్ టీజ‌ర్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ బ‌ర్త్ డే కు రావాల్సిన ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ వాయిదా ప‌డింది. దీంతో తారక్ ఫ్యాన్స్ బాగా డిజ‌ప్పాయింట్ అయ్యారు.

 

తార‌క్ ఫ్యాన్స్ త‌మ హీరో లుక్ ఎప్పుడు వ‌స్తుందా ? అని ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు తార‌క్ అభిమానుల కోరిక ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తీర్చేస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌రోనా హ‌డావిడి త‌గ్గ‌డంతో రాజ‌మౌళి తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. షూటింగ్ స్టార్ట్ అయిన వెంట‌నే ముందు తార‌క్ ఫ‌స్ట్ లుక్ ప్రోమో షూట్ చేస్తార‌ట‌. ఇక ఈ ప్రోమోను ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేసేందుకు ఆర్ ఆర్ ఆర్ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news