Moviesఈ టాలీవుడ్ హాట్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా...!

ఈ టాలీవుడ్ హాట్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా…!

వైవీఎస్‌. చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన దేవ‌దాస్ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది స‌న్న‌న‌డుము సుంద‌రి ఇలియానా. ఆ సినిమా హిట్ అయ్యాక వెంట‌నే మ‌హేష్‌బాబు బ్లాక్‌బ‌స్ట‌ర్ పోకిరిలో కూడా ఆమె హీరోయిన్‌గా న‌టించ‌డంతో ఇలియానా తెలుగులో వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఆ త‌ర్వాత ఇల్లూ బేబీ వ‌రుస‌గా తెలుగులో స్టార్ హీరోలు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్, ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లవర్ బాయ్ తరుణ్, సిద్ధార్ధ ఇలా అంద‌రు హీరోల‌తో న‌టించి హిట్లు కొట్టింది.

 

 

 

పోకిరి మూవీ ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసి ఆమెను స్టార్ హీరోయిన్ పీఠంపై కూర్చోపెట్టేసింది. ఈ అమ్మ‌డు తాజాగా త‌న చిన్న‌నాటి ఫోట‌లు ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ఆ చిన్న‌నాటి ఫొటోల్లో ఒక‌టి బాగా ఆక‌ట్టుకుంటోంది. ఇల్లూ బేబీ తెల్ల‌ని డ్రెస్ వేసుకుని త‌న ఫ్రెండ్స్‌తో తీయించుకున్న ఈ ఫోటోలో ఆమె ఎంతో క్యూట్‌గా ఉంది.

 

ఈ ఫొటోకు కామెంట్స్, లైక్ లు వస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫ‌ర్ ( ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్దార్ సెకండ్ యూనిట్ సినిమాటోగ్రాఫ‌ర్‌) ఆండ్రూతో ప్రేమాయ‌ణం న‌డ‌పడంతో పాటు బోల్డ్ ఫోటోలు షేర్ చేయ‌డం, బోల్డ్ కామెంట్లు, మితిమీరిన శృంగారం గురించి చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆమె హైలెట్ అవుతోంది. బాలీవుడ్లో ఫెయిల్ అయ్యాక తిరిగి టాలీవుడ్‌కు వ‌చ్చేందుకు ఆమె ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఇక్క‌డ వాళ్లు ఆమెను ప‌ట్టించుకోవ‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news