Moviesటీవీ న‌టి శ్రావ‌ణి సూసైడ్‌కు కార‌ణం అత‌డేనా... న‌మ్మించి ఫొటోల‌తో ఘోరంగా...

టీవీ న‌టి శ్రావ‌ణి సూసైడ్‌కు కార‌ణం అత‌డేనా… న‌మ్మించి ఫొటోల‌తో ఘోరంగా వంచించి..

మ‌న‌సు మ‌మ‌త‌, మౌన‌రాగం లాంటి టాప్ సీరియ‌ల్స్ ఫేం శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ మధునగర్‌లోని తన నివాసంలో ఆమె మంగ‌ళ‌వారం ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కాస్త ఆల‌స్యంగా చూసిన కుటుంబ స‌భ్యులు ఆమెను హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించే లోగానే ఆమె మృతి చెందింది. ఇదిలా ఉంటే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం ఓ యువ‌కుడే అని కుటుంబ స‌భ్యులు చెపుతున్నారు. ఆమె టిక్‌టాక్ ద్వారా ప‌రిచ‌యం అయిన యువ‌కుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ న‌మ్మించాడు.

ఆ త‌ర్వాత ఆమెతో స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌తో బ్లాక్‌మెయిల్ చేస్తూ డ‌బ్బులు ఇవ్వాల‌ని తెగ వేధింపులకు గురి చేస్తున్నాడ‌ట‌. ఆ యువ‌కుడి వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని శ్రావ‌ణి కుటుంబ స‌భ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువ‌కుడి వేధింపులు అధికం కావడంతో ఇటీవల ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు.అయినా వేధింపులు ఆప‌క‌పోవ‌డంతోనే శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news