Moviesమెగాస్టార్ చిరుతో జోడీ క‌ట్టిన ముగ్గురు అక్కా చెళ్లెళ్ల క‌థ తెలుసా..!

మెగాస్టార్ చిరుతో జోడీ క‌ట్టిన ముగ్గురు అక్కా చెళ్లెళ్ల క‌థ తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న న‌టించే అవ‌కాశం రావ‌డ‌మే గొప్ప అదృష్టం. అలాంటిది ముగ్గురు అక్కా చెల్లెళ్లు చిరంజీవి ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ కొట్టేశారంటే మామూలు విషయం కాదు. ఆ ముగ్గురు అక్కా చెళ్లెళ్లు ఎవ‌రో కాదు. వెట‌ర‌న్ న‌టి న‌గ్మా, ఆమె చెళ్లెళ్లు రోషిణి, జ్యోతిక‌. న‌గ్మా చిరు ప‌క్క‌న ఘరానా మొగుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో ప‌లు సినిమాలు చేసింది. త‌ర్వాత ఆమె సోద‌రి రోషిణి 1996లో వ‌చ్చిన చిరు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ మాస్ట‌ర్‌ల జోడీ కట్టింది.

Are Actresses Jyothika and Nagma Half-Sisters? The Truth About Their  Relationship! | Astro Ulagam

చివర‌కు ఏడేళ్ల గ్యాప్ త‌ర్వాత 2003లో వ‌చ్చిన ఠాగూర్ సినిమాలో వీరి మ‌రో సోద‌రి జ్యోతిక కూడా ఠాగూర్‌లో న‌టించింది. ఈ ముగ్గురు అక్కాచెళ్లెళ్లు చిరు ప‌క్క‌న న‌టించ‌డ‌మే కాదు సూప‌ర్ హిట్లు సైతం సొంతం చేసుకున్నారు. న‌గ్మా ఘ‌రానా మొగుడు, రోషిణి మాస్ట‌ర్‌, జ్యోతిక ఠాగూర్ సినిమాల‌తో హిట్లు కొట్టారు. వీరిలో న‌గ్మా 45 ఏళ్లు వ‌చ్చినా ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. జ్యోతిక కోలీవుడ్ టాప్ హీరో సూర్య‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Jyothika family photos – actress J Saravanan | Celebrity family wiki

ఇక రోషిణి సైతం సినిమాల‌తో అంత గుర్తింపు తెచ్చుకోక‌పోయినా బుల్లితెర‌పై ఎన్నో హిట్ సీరియ‌ల్స్‌లో న‌టించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఈ ముగ్గురు అక్కా చెళ్లెళ్ల‌కు తండ్రులు ఇద్ద‌రు అయినా తల్లి మాత్రం ఒక‌రే. ఇక న‌గ్మా కాంగ్రెస్ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news