Moviesమంచి నీళ్లు అంటూ సెట్‌లోనే కుప్ప‌కూలి చ‌నిపోయిన ప్ర‌ముఖ‌ నటుడు

మంచి నీళ్లు అంటూ సెట్‌లోనే కుప్ప‌కూలి చ‌నిపోయిన ప్ర‌ముఖ‌ నటుడు

మలయాళ నటుడు ప్రబీష్ చక్కలక్కల్ (44)సెట్స్ లో ఆకస్మికంగా మృతి చెంద‌డంతో అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. మ‌ళ‌యాళంలో ప్ర‌ముఖ డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా పేరున్న ప్ర‌బీష్ కొచ్చిన్ కాలేజ్ యూట్యూబ్ ఛానెల్ కోసం తీస్తోన్న చిత్రం షూటింగ్ కొన‌సాగిస్తున్నారు. దీంతో ఒక్క‌సారిగా ఆయ‌న అక్క‌డే కుప్ప‌కూలిపోయారు. వెంట‌నే ప్ర‌బీష్‌ను హాస్ప‌ట‌ల్‌కు తీసుకు వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. వెంట‌నే వాహ‌నాలు అందుబాటులో లేక‌పోవ‌డంతో అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయాడు.

 

సెట్‌లో ప‌ని పూర్తియిన వెంట‌నే నాలుక ఎండిపోతుంద‌ని.. నీళ్లు ఇవ్వాల‌ని అడిగారు. నీళ్లు తాగిన వెంట‌నే హ‌ఠాత్తుగా కుప్ప‌కూలిపోయార‌ని ప్ర‌బీష్ స‌న్నిహితుడు చెప్పారు. ప్రబీష్ మృతితో కేరళలో విషాదం నెలకొంది. ఆయ‌న మృతికి మ‌ల్లూవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు. ఇక వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై సినిమా షూట్ చేస్తోన్న స‌మ‌యంలో ఈ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news