Moviesఅండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్‌తో కంగ‌నా.. గుట్టు ర‌ట్టు చేసిన తెలుగు హీరోయిన్‌

అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్‌తో కంగ‌నా.. గుట్టు ర‌ట్టు చేసిన తెలుగు హీరోయిన్‌

మహారాష్ట్రలోని శివసేన ప్ర‌భుత్వంపై కంగ‌నా ర‌నౌత్ కొద్ది రోజులుగా తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మ‌రో న‌టి, కాంగ్రెస్ నేత న‌గ్మా కంగ‌నాపై తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు. కంగ‌నా ఎప్పుడో తీసుకున్న ఫొటోలు షేర్ చేసిన నగ్మా అనేక సందేహాలు రైజ్ చేశారు. ఈ ఫొటోలో ఉన్న‌ది ఎవ‌రో న‌గ్మా మాత్రం చెప్ప‌లేదు. పైగా అత‌డు, కంగ‌నా కూర్చుని ఉన్నారు. కంగ‌న ప‌క్క‌న ఉన్న వ్య‌క్తి బీర్ బాటిల్ ప‌ట్టుకుని ఉన్నాడు.

Kangana Ranaut reveals why she has joined Twitter | Entertainment News,The  Indian Express

కంగ‌న ప‌క్క‌న ఉన్న ఆ వ్య‌క్తి మాఫియా డాన్ అబుసలేం సోదరుడు అని.. అత‌డితో కంగనా ఫొటో తీసుకుందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో వైరల్ అయ్యింది. అయితే దీనిపై ఆరా తీస్తే కంగ‌న ప‌క్క‌న బీర్ బాటిల్ ప‌ట్టుకున్న వ్య‌క్తి అబూస‌లేం సోద‌రుడు కాద‌ని క్లారిటీ వచ్చింది. ముంబైకి చెందిన ఓ పాత్రికేయుడు అని తేలింది.

CRPF to Take over Kangana Ranaut's Security After War of Words with Shiv  Sena's Sanjay Raut

గ‌తంలో సిమ్రాన్ సినిమా విడుదల కార్యక్రమంలో కంగనతోపాటు ఆ పాత్రికేయుడు కలిసి దిగిన ఫొటోగా తేలింది. దీంతో కంగనతో మాఫియా డాన్ సోదరుడు ఫొటో అన్న ఊహాగానాలకు తెరపడింది. మ‌రి నగ్మా ఈ ఫొటోనే ఎందుకు షేర్ చేస్తూ కంగ‌నాను టార్గెట్ చేసింది అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. ఇక న‌గ్మా తెలుగులో చిరంజీవి ప‌క్క‌న ఘ‌రానా మొగుడుతో పాటు ప‌లువురు స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news